NTV Telugu Site icon

Facebook Friend: ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పంపింది.. తియ్యని మాటలతో బుట్టలో పడేసింది.. చివరికి ట్విస్ట్ ఇచ్చింది

Facebook Video Call

Facebook Video Call

Karnataka Boy Cheated By Fake Facebook Profile And Lost 41 Lakhs: ఈమధ్య వెలుగుచూస్తున్న ఆన్‌లైన్ మోసాలు అన్నీ ఇన్నీ కావు. అమ్మాయిల పేరుపై ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, అబ్బాయిలకు గాలం వేసి, వారి వ్యక్తిగత వివరాలతో పాటు న్యూడ్ ఫోటోలు తీసుకొని.. తిరిగి వారిని బ్లాక్‌మెయిల్ చేయడం వంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో నిజమైన అమ్మాయిలే ఉంటారు కానీ, ఫేక్ ప్రొఫైల్స్ నేరాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా అలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది. యువతి పేరుపై ఫేక్ ఫోటో పెట్టి.. ఓ దుండగుడు రూ.41 లక్షలు దోచుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Anakapalle Girl Missing: యువతి మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. అసలు కారణం ఇదే!

కుణిగల్‌ తాలూకా కగ్గేరికి చెందిన రవికుమార్‌ (24) అనే యువకుడు.. బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. అయితే.. ఈజీ మనీకి అలవాటు పడిన ఇతను, ఫేస్‌బుక్‌లో యువతి పేరట ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, అబ్బాయిలకు గాలం వేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఒక రోజు రాజేష్ అనే యువకుడు ఆ ఫేక్ ప్రొఫైల్‌కి రిక్వెస్ట్ పెట్టాడు. డీపీలో యువతి ఫోటో చాలా అందంగా ఉండటంతో.. అది నిజమైన ప్రొఫైలా, ఫేక్ ప్రొఫైలా అని తెలుసుకోకుండా రిక్వెస్ట్ పెట్టేశాడు. రాజేష్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన వెంటనే.. రవికుమార్ వెంటనే యాక్సెప్ట్ చేసి, యువతి లాగా చాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. పాపం.. ఆ యువతి నిజమేనని భావించి రాజేష్ మురిసిపోయాడు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత వివరాలన్నీ చెప్పేశాడు.

Viral Marriage News: అక్కను పెళ్లి చేసుకునేందుకు వచ్చి.. చెల్లితో పారిపోయిన ఘనుడు

అంతేకాదు.. ఒకసారి న్యూడ్ వీడియో కాల్ చేయమని చెప్పడంతో, రాజేష్ ముందు వెనుక ఆలోచించకుండా వీడియో కాల్ చేశాడు. దుస్తులన్నీ విప్పేసి, మాట్లాడాడు. అవతల రవికుమార్ తన ఫేస్ కనిపించకుండా మేనేజ్ చేసి, రాజేష్ పర్సనల్ ఫోటోలన్ని స్క్రీన్ షాట్ తీశాడు. ఆ మరుక్షణం నుంచే బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. అడిగినంత డబ్బులివ్వకపోతే ఆ ఫోటోల్ని లీక్ చేస్తానన్నాడు. పరువు పోతుందన్న భయంతో.. రవికుమార్ అడిగినట్టుగా, విడతలవారీగా రూ.41 లక్షలు ఇచ్చాడు. ఇంకా తనని టార్చర్ పెడుతుండటంతో.. అతడు పోలీసుల్ని ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. చాకచక్యంగా నిందితుడ్ని పట్టుకొని, అరెస్ట్ చేశారు.