Site icon NTV Telugu

అగ్ని హోమం పొగతో కరోనా పరార్ అంటున్న బీజేపీ ఎమ్మెల్యే

కరోనా మహమ్మారిని అంతం చేయడానికి ప్రజలు ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కర్ణాటక బెల్గాం దక్షిణ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ ఎమ్మెల్యే అభయ్​ పాటిల్ హోమాలు నిర్వహించారు. అగ్ని హోమం పొగతో కరోనా పరార్ అవుతుందంటూ ఎమ్మెల్యే ప్రచారం చేపట్టారు. హోమాల్లో నెయ్యి, కర్పూరం, నిమ్మకాయలు, బియ్యం, లవంగాలను ఉపయోగించారు. దాదాపు 50 చోట్ల హోమాలను జరిపారు. వాతావరణం పరిశుభ్రమౌతుందని పాటిల్​ అంటున్నాడు. ఓ బండిలో హోమం కాల్చుతూ ఊరంతా తిప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version