Kanpur woman elopes with boyfriend’s father: రోజురోజుకు ప్రేమకు అర్థం మారిపోతుంది. అసలు ప్రేమంటే ఏమిటో తెలియడం లేదు. అలాంటి విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రేమ వ్యవహారాలు హత్యలకు దారి తీస్తున్న సంఘటనలు చూశాం. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో విచిత్ర ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. కాన్పూర్ కు చెందిన ఓ యువతి, బాయ్ ఫ్రెండ్ తండ్రితో లేచిపోయింది. ప్రేమించిన యువకుడిని కాదిని, అతడి తండ్రిని ప్రేమించి, ఇద్దరూ కలిసి ఇళ్లు వదిలివెళ్లిపోయారు.
ఈ విచిత్రమైన ప్రేమ వ్యవహారంలో 20 ఏళ్ల యువతి తన ప్రేమికుడిని కాదని, అతని కుటుంబాన్ని వదిలి అతడి తండ్రితో పారిపోయింది. ఏడాది క్రితం 20 ఏళ్ల అమిత్ అనే యువకుడి తండ్రి కమలేష్, అమిత్ ను ప్రేమించిన యువతి కలిసి పారిపోయారు. తరుచుగా అమిత్ ను కలిసేందుకు వచ్చే క్రమంలో అమిత్ తండ్రి కమలేష్ తో యువతికి చనువు ఏర్పడి మరోసారి ప్రేమకు దారి తీసింది. వీరిద్దరు 2022లో కాన్పూర్ పారిపోయారు. దీనిపై చకేరి పోలీస్ స్టేషన్ లో యువతి కుటుంబీకులు కిడ్నాప్ కేసు పెట్టారు.
ఏడాది పాటు విచారణ సాగించిన పోలీసులు వీరిద్దరిని ఢిల్లీలో గుర్తించి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కమలేష్, యువతి సహజీవనం చేస్తున్నట్లుగా, వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కమలేష్ పోలీసుల అదుపులో ఉండగా.. బుధవారం మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించారు. నా జీవితాన్ని కమలేష్ తోనే గడపాలనుకుంటున్నానని యువతి పోలీసులకు స్పష్టం చేసింది. ఈ ఘటనపై తదుపరి విచారణ చేపట్టారు.