Kannada Actor Nitin Gopi Died by Heart Attack: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సినీ, టెలివిజన్ నటుడు నితిన్ గోపీ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. తనకు ఛాతీలో నొప్పి వస్తోందని నితిన్ చెప్పగానే.. ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. వైద్యుల చికిత్సకు ఆయన స్పందించలేదు. దీంతో.. నితిన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నితిన్ గోపీ హఠాన్మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతికి గురైంది. అభిమానుల దగ్గర నుంచి ప్రముఖుల దాకా.. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. చిన్న వయసులోనే అతను కళ్లు మూయడంతో.. కన్నడ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. నితిన్ గోపీకి పెళ్లి అవ్వలేదు కాబట్టి, ఆయన తన తల్లిదండ్రులతోనే ఉండేవాడు.
Merugu Nagarjuna: చంద్రబాబు కుయుక్తులను ఎవరూ నమ్మొద్దు.. మంత్రి ఫైర్
39 ఏళ్ల నితిన్ గోపీ.. కన్నడ లెజెండ్రీ నటుడు డాక్టర్ విష్ణువర్ధన్ కథానాయకుడిగా రూపొందిన ‘హలో డాడీ’ సినిమాతో బాల నటుడిగా తెరంగేట్రం చేశాడు. అందులో విష్ణువర్ధన్ తనయుడిగా అద్భుత నటన కనబర్చి, అందరి మన్ననలు పొందాడు. కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబందవ్య వంటి మరెన్నో సినిమాలు నటించాడు. పునర్ వివాహ్ అనే సీరియల్‌లోనే ఓ కీలక పాత్రలో కనిపించాడు. ‘హరహర మహదేవ’ అనే భక్తిరస సీరియల్‌తో పాటు కొన్ని తమిళ సీరియల్స్‌లోనూ నటించాడు. నటుడిగా తన సత్తా చాటిన నితిన్ గోపీ.. దర్శకుడిగా తన ప్రతిభ చాటాలని అనుకున్నాడు. ఓ సీరియల్‌కి దర్శకత్వం వహించేందుకు.. ప్రముఖ నిర్మాణ సంస్థలో చర్చలు జరుపుతున్నాడు. కానీ.. ఇంతలోనే నితిన్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
Chammak chandra : జబర్దస్త్ లోకి రాకముందు చమ్మక్ చంద్ర ఇలాంటి పనులు చేశాడా?