NTV Telugu Site icon

Kangana Ranaut: ప్రియాంకా గాంధీ ‘‘ఎమర్జెన్సీ’’ సినిమా చూడాలి.. కంగనా ఆహ్వానం..

Emergency

Emergency

Kangana Ranaut: కంగనా రనౌత్ నటించిన ‘‘ఎమర్జెన్సీ’’ సినిమా ఈ నెల 17న విడుదల కాబోతోంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాలనలో దేశవ్యాప్తంగా 21 నెలల పాటు అత్యవసర పరిస్థితి విధించించింది. ఈ ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కంగనా రనౌత్ ఇందులో ఇందిగా గాంధీగా నటిస్తున్నారు. 1975-1977లో ఇందిరాగాంధీ పాలనలో ‘‘ఎమర్జెన్సీ’’ దేశ రాజకీయాల్లో మాయని మచ్చగా మిగిలింది.

Read Also: Vizag Central Jail: ఎక్కడి నుంచి వస్తున్నాయి..? విశాఖ సెంట్రల్‌ జైలులో మరోసారి సెల్‌ఫోన్‌ కలకలం..

ఇదిలా ఉంటే, కంగనా రనౌత్ తన ఎమర్జెన్సీ సినిమాను చూడటానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీని ఆహ్వానించారు. మీడియాతో మాట్లాడుతూ..‘‘నేను నిజంగా ప్రియాంకా గాంధీని కలిశారు. నా ఎమర్జెన్సీ సినిమాని చూడాలని ముందుగా ఆమెనే పిలిచాను’’ అని అన్నారు. ఇందిరా గాంధీని చాలా గౌరవంగా చిత్రీకరించడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నానని, చాలా పరిశోధనలు చేశానని, వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని అన్నారు. ఇందిరాగాంధీ ఎంతో మంది ఇష్టపడే నాయకురాలని కంగనా అన్నారు. మూడుసార్లు ప్రధాని కావడం అంటే జోక్ కాదని ఇందిరా గాంధీని కొనియాడారు.

Show comments