Site icon NTV Telugu

JEE Advanced : పరీక్ష తేదీల్లో మార్పు.. ఎప్పుడంటే..?

Jee Advanced

Jee Advanced

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీలు రీషెడ్యూల్ చేయబడ్డాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ 2022 వెబ్‌సైట్‌లో జారీ చేసిన తాజా సర్క్యులర్‌లో, ఇప్పుడు పరీక్షను ఆగస్టు 28 ఆదివారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) బాంబే తేదీలను సవరించింది. గతంలో జులై 3న పరీక్ష జరగాల్సి ఉండగా.. పరీక్ష కింద ఉన్న రెండు పేపర్లను ఒకే రోజు నిర్వహిస్తారు.

తొలి టెస్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. రెండవ పేపర్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పరీక్ష ఫీజును ఆగస్టు 12 వరకు చెల్లించవచ్చు. అభ్యర్థులు ఆగస్టు 23 నుంచి 28 వరకు ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చెల్లించుకోవచ్చు. జేఈఈ మెయిన్ రెండో విడత జులై 30తో ముగుస్తుంది. మొదటి, రెండో విడతల్లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం ఉంటుంది.

Exit mobile version