Flight Emergency Landing: జెడ్డా- హాంకాంగ్ కార్గో విమానం కోల్‌కతా ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. జెడ్డా నుంచి హాంకాంగ్ వెళ్తున్న సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం విండ్ షీల్డ్ కు పగుళ్లు రావడంతో అప్రమత్తం అయిన పైలెట్లు అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. శనివారం ఉదయం 11:37 గంటలకు పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం కోల్‌కతా విమానాశ్రయంలోని సిబ్బంది అప్రమత్తం అయింది. మధ్యాహ్నం 12.02 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ తరువాత ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నారు.
Read Also: Sudan: సూడాన్ లో ఆర్మీ-పారామిలిటరీ మధ్య ఘర్షణ.. భారతీయులకు ఇంటికే పరిమితం కావాలని సూచన
ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లతో పాటు మొత్తం నలుగురు ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. దుబాయ్ కి వెళ్లే ఫెడెక్స్ విమానం టేకాఫ్ అయిన వెంటనే పక్షి ఢీ కొనడంతో ఢిల్లీ విమానాశ్రయంలో పూర్తిగా అత్యవసర పరిస్థితిని ప్రకటించిన కొన్ని రోజులకే ఇది జరిగింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత మరమ్మతులు చేసి విమానాన్ని పంపించారు. ఆ సమయంలో 1000 అడుగుల ఎత్తులో పక్షి విమానాన్ని ఢీ కొట్టింది.