Site icon NTV Telugu

Jasmine Prices: ఆకాశాన్నంటిన మల్లెపూల ధర.. కేజీ మూడువేలు

White Jasmi

White Jasmi

మల్లెపూల వాన.. వాన.. వాన.. ఇది మల్లెల వేళ అనీ…..పెళ్ళిళ్లలోనే కాదు కొత్తగా పెళ్లయిన వారికి కూడా మల్లెపూలంటే ఎంతో మోజు.. మండుటెండల్లో సైతం చల్లదనాన్ని..సుగంధ పరిమళాన్నిస్తాయి. మగువకు మిక్కిలి ఇష్టమైనవి. అందుకే మల్లె అందం మగువకే తెలుసని అంటుంటారు. ఇంట్లో భార్యకు మూరెడు మల్లెపూల దండ తీసుకెళితే ఆమె ఆ భర్తకు దాసోహం అంటుంది. కానీ ఇప్పుడు ఆ మూరెడు మల్లెపూలు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు మల్లెపూలు బాగా ప్రియం అయిపోయాయి. తమిళనాడులో మల్లెపూలు కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రికార్డు స్ధాయిలో మల్లెపూల ధర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మధురైలో మూడువేలు దాటాయి కేజీ మల్లెపూలు. మల్లెల ధరలు మరింత పెరగవచ్చని అంటున్నారు వ్యాపారులు..పంట దిగుబడి తగ్గడం….వరుసగా పండుగలు రావడంతో ఆకాశంలో మల్లెపూల ధరలు చేరాయి.

మల్లె పూలు.. మహా ప్రియం

సాధారణంగా ఎంత సీజన్ అయినా మల్లెపూలు కేజీ వేయి రూపాయలకు తక్కువే వుంటాయి. కానీ ఇప్పుడు కేజీ మూడింతలు పెరగడంతో వ్యాపారులు కూడా వాటిని అమ్మలేకపోతున్నారు. మల్లెపూలు కేవలం సువాసనకే కాదు..ఓ దివ్యౌషధంలా కూడా ఉపయోగపడతాయని తెలుసా. మల్లెపూలు కేవలం మానసిక ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా మెడిసిన్‌లా ఉపయోగపడతాయి. వివిధ సమస్యలకు మల్లెపూలను వాడతారు. పెళ్ళిళ్లో పెళ్ళికూతురుకి మల్లెపూలతో భారీ దండ కడతారు.

మల్లెపూలతో అలంకరిస్తారు. ఇంట్లో మల్లెపూలు వున్నాయంటే ఆసుగంధమే వేరుగా వుంటుంది. ఈనెలలో శుభకార్యాలు ఎక్కువగా ప్రారంభం కావడంతో మల్లెపూల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో మల్లెపూలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండాపోయాయి. మల్లెపూలు, కనకాంబరాలను భారీ ధరకు అమ్ముతున్నారు. దీంతో సామాన్య మహిళలకు మూర మల్లెలు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది.

Read Also: mSeediri Appalaraju : మంత్రి అప్పలరాజుకు పలాస అనుచరులు ఝలక్

Exit mobile version