NTV Telugu Site icon

Holi Incident: హోలీ సంఘటనపై జపాన్ మహిళ స్పందన.. దేశం వదిలివెళ్లిన తర్వాత ట్వీట్స్..

Holi Incident

Holi Incident

Japanese Woman Tweets On Holi Incident: ఇటీవల హోలీ పండగ సందర్భంగా ఓ జపాన్ యువతిపై కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు.బలవంతంగా రంగులు పూస్తు, కొడిగుడ్లు నెత్తిన కొడుతూ యువతిని అసౌకర్యానికి గురిచేశారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే ఈ ఘటనపై సదరు మహిళ ఫిర్యాదు చేయనప్పటికీ.. ఘటనకు కారణం అయిన యువకులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

తాజాగా ఈ ఘటనపై సదరు జపాన్ యువతి స్పందించారు. ఈ సంఘటనను దురదృష్టకరమని పేర్కొన్నారు. తన 35 మంది స్నేహితులతో కలిసి హోలీ పండగలో పాల్గొన్నానని ట్వీట్ లో తెలిపింది. భారతీయ పండగ అయిన హోలీ రోజు ఒక మహిళ ఒంటరిగా బటయు వెళ్లడం ప్రమాదంకరమని నేను విన్నాను. అందుకే తాను 35మంది స్నేహితులతో కలిసి పండగలో పాల్గొన్నాను అని ట్వీట్ చేసింది. న్యూఢిల్లీలోని పహర్ గంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కొంత మంది యువకులు యువతిపై రంగులు చల్లడం, మరో యువకుడు ఆమె తలపై కోడిగుడ్డు కొట్టడం వీడియోలో కనిపించింది.

Read Also: Kunamneni Sambasiva Rao : బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి

మరోవైపు సదరు జపాన్ యువతి భారతదేశంపై ప్రేమను చాటుకుంది. ‘‘నేను భారతదేశం గురించి ప్రతీ విషయాన్ని ప్రేమిస్తాను. నేను చాలాసార్లు ఇక్కడి వచ్చాను. ఇది ఎంతో అందమైన దేశం. భారతదేశం, జపాన్ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటాయి’’ అని ట్వీట్ చేశారు. మార్చి 9న తాను హోలీకి సంబంధించిన ట్వీట్ చేశాను. అయితే దీనికి వచ్చిన స్పందన చూసి భయపడి తొలగించానని ఆమె జపనీస్ లో ట్వీట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఒక యువకుడితో పాటు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పహర్ గంజ్ సమీప నివాసితులు. ఈ ఘటనలో తమ ప్రమేయం ఉన్నట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళలపై వేధింపులను అణిచివేస్తామని, భద్రతను పటిష్టం చేస్తామని వెల్లడించారు.