NTV Telugu Site icon

Jammu Kashmir Exit Poll 2024: జమ్మూ కాశ్మీర్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌కి దూరంగా కాంగ్రెస్, బీజేపీ..

Exit Polls

Exit Polls

Jammu Kashmir Exit Poll 2024: జమ్మూ కాశ్మీర్‌లో ఇటు బీజేపీ కానీ, అటు ఎన్సీ- కాంగ్రెస్ కూటమి కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేవని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. జమ్మూ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటుతుంటే, కాశ్మీర్‌లోయలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తుందని సర్వేలు అంచనా వేశాయి. అయితే, మొత్తం జమ్మూ కాశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాల్లో 46 మ్యాజిక్ ఫిగర్. ఏ కూటమి కూడా మ్యాజిక్ ఫిగర్‌ని సాధించలేవని సర్వేలు చెబుతున్నాయి. అసలు ఫలితాలు అక్టోబర్ 08న వెలువడుతాయి.

జమ్మూ కాశ్మీర్ (90)

దైనిక్ భాస్కర్: బీజేపీ 20-25, కాంగ్రెస్ 35-40, పీడీపీ 4-7, ఇతరులు 12-16
పీపుల్స్ పల్స్: బీజేపీ 23-27, కాంగ్రెస్ 46-50, పీడీపీ 7-11, ఇతరులు 4-6
రిపబ్లిక్ మ్యాట్రిజ్: బీజేపీ-25, కాంగ్రెస్ -12, ఎన్సీ-15, పీడీపీ-28

Show comments