NTV Telugu Site icon

Jammu Kashmir: విద్యార్థులకు దీపావళి గుడ్‌న్యూస్.. విద్యాసంస్థలకు 5 రోజులు సెలవులు

Jkschoolsholidays

Jkschoolsholidays

జమ్మూకాశ్మీర్‌లో ఏర్పడిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం దీపావళి పండుగ పురస్కరించుకుని ఐదు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు (శనివారం) సెలవులు ప్రకటించాయి. ఆదివారం కలుపుకుని మొత్తంగా ఆరు రోజులు విద్యార్థులకు సెలవులు దొరకనున్నాయి. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జమ్మూ సెలవులకు సంబంధించి అధికారిక నోటీసును జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Actor Bala: కోట్ల ఆస్తి కోసం 4వ పెళ్లి చేసుకున్న నటుడు

డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జమ్మూ (DSEJ) ప్రకటించిన ప్రకారం.. జమ్మూ పాఠశాలలు అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2, 2024 వరకు మూసివేయబడతాయని తెలిపింది. హయ్యర్ సెకండరీ స్థాయి వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలన్నింటికీ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీపావళి ఉత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నవంబర్ 4, 2024న సెలవుల విరామం తర్వాత తరగతులు పునఃప్రారంభించబడతాయని విద్యాశాఖ వెల్లడించింది. ఇక ఆదివారం సెలవును కూడా కలుపుకుని మొత్తంగా ఆరు రోజులు విద్యార్థులకు విరామం దొరకనుంది.

ఇది కూడా చదవండి: Flight Bomb Threats: విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు.. ‘‘ఎక్స్‌’’పై కేంద్రం ఆగ్రహం..

దసరా అనంతరం ఒకేసారి ఇన్ని సెలవులు దొరకడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తమిళనాడులోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు నవంబర్ 1వరకు సెలవులు ప్రకటించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తిరిగి తమ స్వస్థలానికి వచ్చేందుకు వీలుగా నవంబర్‌ ఒకటిన సెలవు ప్రకటించారు.