Site icon NTV Telugu

JK: జమ్మూకాశ్మీర్‌లో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం

Jk

Jk

జమ్మూకాశ్మీర్‌లో కొత్తగా ఏర్పడిన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం-రాజ్‌భవన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కేంద్రపాలిత వ్యవస్థాపక దినోత్సవాన్ని బహిష్కరించింది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తప్పుపట్టారు. ఇది ద్వంద్వ వైఖరి అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో మనోజ్ సిన్హా-ఒమర్ అబ్దుల్లా మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.

ఇది కూడా చదవండి: Patna: ప్రియుడితో భార్య పారిపోతుండగా భర్త సడన్ ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

జమ్మూకాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పడ్డాక.. రాష్ట్ర హోదా కల్పించాలంటూ కేబినెట్ తీర్మానం చేసింది. దీనికి గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఆమోదం తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఒమర్ అబ్దుల్లా.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ చేసిన తీర్మాన కాపీని అందజేశారు. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌ను ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించడంలేదు. దీంతో పౌండేషన్ డే ఈవెంట్‌ను బహిష్కరించింది. కానీ గవర్నర్ మాత్రం తీవ్రంగా తప్పుపట్టారు. ఇది ద్వంద్వ స్వభావం అంటూ తూర్పారాబట్టారు. మొత్తానికి పౌండేషన్ డే వ్యవహారం రాజ్‌భవన్-ప్రభుత్వం మధ్య అగ్గిరాజేసింది.

ఇది కూడా చదవండి: Rule Change: రేపటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలు..

Exit mobile version