Site icon NTV Telugu

Pahalgam Terror Attack: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా.. రూ.10లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Government

Government

పహల్గామ్ మృతుల కుటుంబాలకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఒక్కొక్క కుటుంబానికి రూ.10లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం పహల్గామ్‌లో జరిగిన దాడిలో ఇద్దరు విదేశీయలతో పాటు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. మహిళలను, చిన్నారులను విడిచి పెట్టేశారు. ఇక ఈ ఘటనలో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ఉండడం విశేషం.

ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. కాశ్మీర్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక సంఘటనాస్థలిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు. అలాగే బాధిత కుటుంబాలను ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Pahalgam Terrorist Attack: రాత్రి వైజాగ్‌కు సీఎం చంద్రబాబు.. చంద్రమౌళి మృతదేహానికి నివాళులు!

ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. హుటాహుటినా భారత్‌కు వచ్చేశారు. ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఇక సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అనంతరం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర కేబినెట్ నిర్ణయాలను తెలియజేయనున్నారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దాదాపు 8-10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. 5-7 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. దాడి చేసింది తామేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ప్రకటించింది. ఈ ఉగ్రవాదులంతా కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. మహిళలు, పిల్లల్ని ఏమి చేయలేదు. వారి జోలికి కూడా రాలేదు. ఒకవేళ అడ్డొచ్చినా.. ఏమీ చేయలేదు. ఇక ముస్లిమా? కాదా? అని వివరాలు అడిగి తెలుసుకున్నాకే కాల్చారు. ఐడీ కార్డులో పేరు చూసి మరీ కాల్చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, చైనా, నేపాల్, ఇరాన్, ఇటలీ, ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మోడీకి ఫోన్ చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: ఉగ్రవాదులను ఏరివేయడంలో అజిత్ దోవల్ దిట్ట.. అజిత్ తదుపరి వ్యూహం ఏంటి?

Exit mobile version