Site icon NTV Telugu

Big Alert: నిఘా వర్గాల హెచ్చరిక.. కాశ్మీర్‌లో 48 పర్యాటక ప్రాంతాలు మూసివేత

Pahalgamterrorattack77

Pahalgamterrorattack77

పహల్గామ్ దాడి తరహాలో మరిన్ని దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత తర్వాత జమ్మూకాశ్మీర్‌లో స్లీపర్‌ సెల్స్‌ యాక్టివేట్‌ అయినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రణాళిక ప్రకారం కాశ్మీర్‌లో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌లో 87 పర్యాటక ప్రదేశాల్లో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. స్థానిక ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాలని సూచించాయి. కాశ్మీర్‌లోని ప్రధాన ప్రదేశాలతో పాటు సున్నితమైన పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించాయి.

ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: అలా అయితే భారత్‌ను వదిలి పాక్‌కు వెళ్లిపోండి.. పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్‌..

పాకిస్తాన్ గూఢచారి సంస్థ, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI).. ముఖ్యంగా శ్రీనగర్, గండేర్బల్ జిల్లాల్లో స్థానికేతరులు, సీఐడీ సిబ్బంది, కాశ్మీరీ పండిట్లపై లక్ష్యంగా దాడులు చేయాలని ప్లాన్ చేస్తోందని నిఘా సంస్థ సూచించింది. ఉత్తర, దక్షిణ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు చురుగ్గా పాల్గొనవచ్చని గుర్తించింది. వీళ్లంతా భారీ స్థాయిలో ఉగ్రదాడులకు పాల్పడొచ్చని పేర్కొన్నాయి. రైల్వే వ్యవస్థను కూడా టార్గెట్ చేసుకోచ్చని స్పష్టం చేశాయి. రైల్వే భద్రతా వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేటాడుతున్నాయి. పహల్గామ్ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: ఉగ్రవాది హషిమ్‌ మూసా అప్‌డేట్ ఇదే.. దర్యాప్తులో ఏం తేలిందంటే..!

Exit mobile version