Site icon NTV Telugu

EAM Jaishankar: ఆ విషయంలో “ఎవరినీ ఫూల్స్ చేయలేరు”.. అమెరికాపై జైశంకర్ ఆగ్రహం

Eam Jai Shankar

Eam Jai Shankar

Jaishankar angered America over military aid to Pakistan: పాకిస్థాన్ కు అమెరికా చేస్తున్న మిలిటరీ సాయంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎఫ్-16 యుద్ధ విమానాలకు సంబంధించి అమెరికా, పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీనిని జైశంకర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయంలో అమెరికా ఎవరినీ మోసం చేయం చేయలేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికి ఇటీవల పాకిస్తాన్ కు అమెరికా ఎఫ్-16 యుద్ధ పరికరాలను అమ్ముతున్నట్లు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. అయితే ఇది భారత్ కు వ్యతిరేకంగా కాదని.. కేవలం బిజినెస్ డీల్ అని అమెరికా చెబుతోంది. దక్షిణాసియాలో సమతైల్యాన్ని ఇది ప్రభావితం చేయదని అమెరికా చెబుతోంది.

యూఎస్ లో 10 రోజుల పర్యటనలో ఉన్న జైశంకర్ ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద వ్యతిరేక బెదిరింపులను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ కోసం ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను పంపుతున్నట్లు అమెరికా వాదనపై.. ‘మీరు ఈ మాటలు చెప్పి ఎవరినీ మోసం చేయలేదు’ అని అన్నారు. పాకిస్తాన్-అమెరికా సంబంధం గురించి మాట్లాడుతూ.. ఇది అమెరికాకు ఎంత మాత్రం ఉపయోగపడదని వ్యాఖ్యానించారు. ఒక వేళ అమెరికా విదేశాంగ పాలసీలను రూపొందించే వారితో మాట్లాడాల్సి వస్తే మీరు ఏం చేస్తున్నారని అడుగుతానని.. ఇది నిజంగా మీకు మంచిది కాదని చెబుతా అని ఆయన అన్నారు.

Read Also: Russia School Shooting: రష్యా స్కూల్ కాల్పుల్లో 13 మంది మృతి..

ఇటీవల అమెరికా, పాకిస్తాన్ మధ్య బంధం బలపడుతోంది. అమెరికా, పాకిస్తాన్ కు ఎఫ్-16 యుద్ధవిమానాల మరమ్మతు.. సాఫ్ట్ వేర్, ఇతర సైనిక సామాగ్రిని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ ఒప్పందం విలువ 45 కోట్ల డాలర్లు. అయితే ఉగ్రవాదం అని పేరుతో పాకిస్తాన్, అమెరికా నుంచి సైనిక, ఆర్థిక సాయం తీసుకుంటోంది. అయితే గతంలో ఉగ్రవాదం కోసమని పాకిస్తాన్ తీసుకున్న సాయాన్ని దుర్వినియోగం చేసింది. పైగా ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోక.. వాటి ఎదుగుదలకు సహకరించింది. దీంతో అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ కు 200 కోట్ల డాలర్ల భద్రతా సాయాన్ని నిలిపివేశారు.

అయితే జైడెన్ పదవిలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ తో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించుకుంటున్నాడు. అయితే ఈ డీల్ లో బాంబులు, క్షిపణులు ఉండవని అమెరికా చెబుతోంది. గతంలో పాకిస్తాన్ పై ఎయిర్ స్ట్రక్స్ చేసిన సమయంలో ఎఫ్-16 యుద్ధ విమానాలతో భారత్ పై దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్. ఆ సమయంలోనే ఓ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని మిగ్ బైసన్ విమానంతో కూల్చేశారు మన అభినందన్ వర్థమాన్. ఆ తరువాత పాకిస్థాన్ కు పట్టుబడ్డాడు.

Exit mobile version