మహా కుంభమేళా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. మళ్లీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ పై జోస్యం చెప్పాడేమో అని అనుకుంటే పొరపాటే. గంజాయితో దొరికిపోవడంతో ఐఐటీ బాబా మరోసారి సంచలనంగా మారాడు. గంజాయి కేసులో జైపూర్ పోలీసులు ఐఐటీ బాబా అభయ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో వెల్లడించడంతో.. పోలీసులు అతని ఆచూకీ కనిపెట్టి జైపూర్‌లోని రిద్ధి-సిద్ధి ప్రాంతంలోని ఒక హోటల్ లో అతన్ని పట్టుకున్నారు.
Also Read:Poco M7 5G: కేవలం రూ.9999కే ఇన్ని ఫీచర్స్ ఏంటి భయ్యా!
శిప్రపథ్ పోలీస్ స్టేషన్ సిఐ రాజేంద్ర గోదారా తన సిబ్బందితో హోటల్‌కు చేరుకుని బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో బాబా దగ్గర గంజాయి, మరికొన్ని మత్తు పదార్థాలు కూడా దొరికినట్లు సమాచారం. హోటల్ గదిలో పోలీసులు సోదాలు చేయగా గంజాయితో సహా మరికొన్ని మాదకద్రవ్యాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐఐటీ బాబాను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాబా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:CM Revanth Reddy: కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ
అభయ్ సింగ్ వద్ద దొరికిన డ్రగ్స్ పై కూడా వివరాలు సేకరిస్తున్నారు. బాబాపై ఇప్పటికే ఏవైనా కేసులు నమోదయ్యాయా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో NDPS సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై స్పందించిన అభయ్ సింగ్ అలియాస్ ఐఐటీ బాబా అది గంజాయి కాదు ప్రసాదం అని చెప్పారు. ఈ ప్రసాదం మీద కేసు పెడితే, కుంభ మేళాలో చాలా మంది దీనిని సేవించారని, వారందరినీ అరెస్టు చేయాలని పోలీసులను కోరాడు.