Site icon NTV Telugu

Jaipur: జైపూర్‌ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది రోగులు మృతి

Jaipur

Jaipur

జైపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సవాయి మాన్ సింగ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది రోగులు మృతిచెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు అంటుకోగానే ఆస్పత్రి సిబ్బంది పారిపోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సవాయి మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆస్పత్రిలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. పొగ వేగంగా వ్యాపించడంతో రోగులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో రోగుల కుటుంబాలు భయాందోళనకు గురయ్యారు. ఇక గైడెన్స్ చేయాలని ఆస్పత్రి సిబ్బంది ముందుగానే తప్పించుకుని పారిపోయారు.

ఇది కూడా చదవండి: Khawaja Asif: అదే జరిగితే భారత్ యుద్ధ విమానాలు సమాధి అవుతాయి.. పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

స్టోరేజ్ ఏరియాలో మంటలు చెలరేగినప్పుడు న్యూరో ఐసీయులో 11 మంది రోగులు చికిత్స పొందుతున్నారని ట్రామా సెంటర్ ఇన్‌చార్జ్ డాక్టర్ అనురాగ్ ధాకడ్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నట్లు తెలిపారు. మంటలు అంటుకున్న కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసినట్లు సమాచారం. 2 గంటల్లో మంటలను అదుపు చేశారు.

ఇది కూడా చదవండి: Pahalgam Attack: పహల్గామ్ దాడికి సహకరించిన వ్యక్తిని పట్టించిన మొబైల్ ఛార్జర్.. అసలు ఏం జరిగింది?

మృతులు పింటు (సికార్‌ వాసి), దిలీప్ (అంధీ, జైపూర్‌కు చెందినవారు), శ్రీనాథ్, రుక్మిణి, ఖుర్మా (అందరూ భరత్‌పూర్‌కు చెందినవారు), బహదూర్ (సంగనేర్, జైపూర్‌కు చెందినవారు)గా అధికారులు గుర్తించారు.  మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని డాక్టర్లు తెలిపారు. మరో పద్నాలుగు మంది రోగులను వేరే ఐసీయులో చేర్చామని.. సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. ఇక స్టోరేజ్‌లో ఉన్న వివిధ పత్రాలు, ఐసీయు పరికరాలు, రక్త నమూనా గొట్టాలు, ఇతర వస్తువులు మంటల్లో కాలిపోయాయి.

ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోగారం పటేల్, హోం శాఖ సహాయ మంత్రి జవహర్ సింగ్ బేధం ట్రామా సెంటర్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రోగుల కుటుంబాలు తమ గోడునుు వెళ్లబుచ్చారు. ఆస్పత్రి సిబ్బంది తమకు సహకరించలేదని ఫిర్యాదు చేశారు. పొగ రాగానే చెప్పినా కూడా సిబ్బంది పట్టించుకోలేదని వాపోయారు. ఇక మంటలు అంటుకోగానే సిబ్బందే మొదట పారిపోయారని.. గందరగోళం నెలకోవడంతో రోగులు ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు.

 

Exit mobile version