కేంద్రమంత్రి జయంత్ సింగ్ కుమార్తె సాహిరా సింగ్ కూచిపూడి ప్రదర్శనతో అరంగేట్రం చేసింది. ఢిల్లీలోని కమానీ ఆడిటోరియంలో బుధవారం జరిగిన ప్రదర్శనతో ఎంట్రీ ఇచ్చింది. అంతర్జాతీయ ఉత్సవం ముగింపు వేడుకలో ఆమె నాట్యం చేసింది. ఈ ప్రదర్శనకు రాజ్యసభ ఛైర్మర్ జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా హాజరై వీక్షించారు. ప్రదర్శన అనంతరం ఉప రాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు.
జయంత్ సింగ్ .. స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు విద్యా శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన కుమార్తె సాహిరా సింగ్ భారతీయ శాస్త్రీయ నృత్యం కూచిపూడితో అరంగేట్రం చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ తన భార్యతో కలిసి హాజరయ్యారు. ఆమె ప్రదర్శనను జగదీప్ ధన్కర్ ప్రశంసించారు. ఉపరాష్ట్రపతి సందేశానికి జయంత్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. మన పిల్లలు సంప్రదాయ కళలతో అనుబంధం పెంచుకోవడం, దయతో వాటిని ప్రదర్శించడం మాకు గర్వకారణం!.’’ అంటూ కేంద్రమంత్రి రీట్వీట్ చేశారు. న్యూఢిల్లీలోని కమనీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మరియు కళాభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది.
Witnessed a soothing, sublime performance of Indian classical dance by Ms. Sahira Singh at Kamani Auditorium today. This display of our traditional art form is not only a feast to the senses, but also a reflection of the rich cultural and civilizational ethos of Bharat.… pic.twitter.com/Vg4WeGB52m
— Vice-President of India (@VPIndia) October 23, 2024
Thank you for your kind blessings on the occasion. Our children connecting with traditional arts and performing them with grace makes us proud! https://t.co/Wj6O9jbGGw
— Jayant Singh (@jayantrld) October 23, 2024