Site icon NTV Telugu

MP Airport: కూలిన టెర్మినల్ పైకప్పు.. కారు ధ్వంసం.. తప్పిన ప్రాణాపాయం

Aeie

Aeie

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ దుమ్నా ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలు కారణంగా టెర్మినల్ రూఫ్‌టాప్ పడిపోయింది. పార్కు చేసిన కారు మీద పడడంతో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి కొద్ది సేపటి క్రితమే కారులోంచి ఆదాయపు పన్ను అధికారి, డ్రైవర్ కిందకి దిగారు. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.

ఇది కూడా చదవండి: Walking After Meal: రాత్రి భోజనం తర్వాత నడిస్తే ఎన్ని లాభాలో..!

ఇదిలా ఉంటే ఈ విమానాశ్రాయాన్ని కొన్ని నెలల క్రితమే రూ.450 కోట్ల వ్యయంతో పునరుద్ధరించారు. కానీ గురువారం కురిసిన వర్షానికి అతలాకుతలం అయింది. దీంతో నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి:West Godavari: తాడేపల్లిగూడెంలో దంపతుల మృతి.. విద్యుత్‌ షాక్‌తో భార్య.. కాపాడబోయి భర్త మృతి

కారు పైకప్పు పడిపోవడానికి పది నిమిషాల ముందు ఆదాయపు పన్ను అధికారి మరియు డ్రైవర్ కారు దిగిపోయారని చెబుతున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏ విమానం కూడా రాలేదు. లేకుంటే ఈ ఘటన కారణంగా ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండేది. ఈ సంఘటన గురువారం ఉదయం 11.30 గంటలకు జరిగింది. విమానాశ్రయంలో ఈ కొత్త భాగం ఇటీవలే ప్రారంభమైంది. ఈ ఘటనపై కేంద్ర విమానాశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version