Site icon NTV Telugu

ITBP Bus Accident: ఐటీబీపీ బస్సు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

Bus Falls Into Riverbed

Bus Falls Into Riverbed

ITBP Bus Accident in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం జరిగిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) బలగాలు ప్రయత్నిస్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే 6 మంది ఐటీబీపీ సిబ్బంది చనిపోగా.. తాజా మరో ఇద్దరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బ్రేకులు ఫేలవడంతో నదిలోయలో పడింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది మరణించగా.. 31 మంది గాయపడ్డారు. గాయపడన జవాన్లకు శ్రీనగర్ లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: CM KCR: దుష్టశక్తుల్ని తరిమికొట్టాలి.. వికారాబాద్ సభలో కేసీఆర్ నిప్పులు

అమర్ నాథ్ యాత్రకు సంబంధించి విధులు నిర్వర్తించి వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 75వ స్వాతంత్య్ర సంబరాలు చేసుకున్న మరసటి రోజే ఈ ఘటన జరగడం దిగ్భ్రాంతి కలిగింది. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే 19 అంబులెన్స్ లు హుటాహుటీగా సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లకు చికిత్స అందించారు. సిరియస్ ఉన్న జవాన్లను హెలికాప్టర్ ద్వారా ఎయిల్ లిఫ్ట్ చేశారు. అనంత్ నాగ్ తో పాటు, శ్రీనగర్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స జరుగుతోంది.

ఇటీవల జరిగిన అమర్ నాథ్ యాత్ర కోసం కేంద్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. యాత్ర కోసం దాదాపుగా 400 కంపెనీలు మోహరించాయి. ఇప్పుడు అమర్ నాథ్ యాత్ర ముగియడంతో బలగాలను ఉపసంహరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చందన్వారి నుంచి పహల్గామ్ వెలుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Exit mobile version