israel-palestine conflict : ఇజ్రాయిల్- పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే భారత్, అమెరికా, యూకే, జర్మనీ వంటి దేశాలు పాలస్తీనాకు మద్దతు తెలుపగా.. ఇరాన్, యెమెన్, సౌదీ, ఖతార్ వంటి ముస్లిం రాజ్యాలు పాలస్తీనా వైపు ఉన్నాయి. అయితే ఇండియా ఇప్పటికే మిత్రదేశం ఇజ్రాయిల్ కి మద్దతు తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్‌కి అండగా ఉంటానమి, ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో ఫోన్ లో చెప్పారు.
ఇదిలా ఉంటే ఇండియా వ్యాప్తంగా పలు పార్టీలు ఇజ్రాయిల్-పాలస్తీనా విషయంలో రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలస్తీనాకు మద్దతుగా కాంగ్ెస్ బహిరంగంగా ముందుకు వచ్చింది. నిన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో పాలస్తీనా-ఇజ్రాయిల్ వివాదంపై విచారం వ్యక్తం చేసింది, కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. పాలస్తీనా హక్కులకు మద్దతు ఇచ్చింది. దీనికి మద్దతుగా తీర్మానించింది.
Read Also: Putin: ఇది అమెరికా వైఫల్యమే.. ఇజ్రాయిల్-పాలస్తీనాపై రష్యా అధ్యక్షుడు..
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ దారిలోనే మరో పార్టీ నడుస్తోంది. ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ పాలస్తీనాకు మద్దతుగా తీర్మానం చేసింది. గతంలో మాదిరిగానే భారత్ కూడా పాలస్తీనాకు మద్దతు కొనసాగించాలని పేర్కొంది. ఈమేరకు ఈ రోజు పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో తీర్మానం చేసింది. ఇజ్రాయిల్ పాలస్తీనాను ఆక్రమించుకోవడమే మొత్తం పశ్చిమాసియా ఉద్రిక్తతలకు మూలకారణం, పవిత్ర స్థలం ఖుద్స్ ఆక్రమణ అన్యాయమని తన తీర్మానంలో పేర్కొంది. ఇది కేవలం పాలస్తీనాకే కాదు మొత్తం మానవ సమాజానికి వ్యతిరేకంగా ఉన్న మానవహక్కుల సమస్యగా తెలిపింది.
పాలస్తీనా వివాదానికి శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలని, ఆ సమయంలో పాలస్తీనాకు భారత్ అండగా నిలవాలని డిమాండ్ చేసింది. మేము పాలస్తీనా ప్రజలకు బలమైన మద్దతు అందిస్తామి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తీర్మానంలో పేర్కొంది.