NTV Telugu Site icon

West Bengal: కోల్‌కతా ఘటన మరవకముందే.. బెంగాల్ హాస్పిటల్‌లో నర్స్‌పై వేధింపులు..

West Bengal Hospital

West Bengal Hospital

West Bengal: కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఘటన యావత్ దేశాన్ని ఆగ్రహావేశాలకు గురిచేసింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. కాలేజ్ సెమినార్ హాలులోనే దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా వైద్యులు, హెల్త్ వర్కర్లకు తోడు సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. ఇప్పటికీ బెంగాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తో్ంది.

Read Also: Kanguva Release Date: ఆ సినిమా రిలీజ్‌కు దారి ఇవ్వాలి.. కంగువ విడుదలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

ఇదిలా ఉంటే, ఈ ఘటనను ఇంకా మరవకముందే బెంగాల్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుపై రోగి వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి బీర్భూమ్‌లోని ఇలంబజార్ హెల్త్ సెంటర్‌లో నర్సు విధి నిర్వహణలో ఉండగా, రోగి వేధింపులకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో చికిత్స చేస్తున్న సమయంలో రోగి తనని వేధించాడని నర్సు ఆరోపించింది. ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుడి వెంట అతడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

‘‘నేను డాక్టర్ సూచనలు పాటిస్తున్నప్పుడు మగ రోగి నాతో అనుచితంగా ప్రవర్తించాడు. నా ప్రైవేట్ భాగాలపై అనుచితంగా తాకాడు. అతను నాపై దుర్భాషలాడాడు’’ అని నర్సు వివరించింది. సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని, లేకపోతే రోగి కుటుంబ సభ్యుల సమక్షంలో డ్యూటీలో ఉన్న వ్యక్తిపై అలాంటి పనిచేయడానికి ధైర్యం ఎలావస్తుంది..? అని ఆమె పేర్కొంది. ఈ ఘటన తర్వాత ఆస్పత్రి యాజమాన్యం పోలీసుల్ని ఆశ్రయించడంతో నిందితుడైన రోగిని అదుపులోకి తీసుకున్నారు.