Site icon NTV Telugu

IRCTC: జ్యోతిర్లింగాల దర్శనం కోసం సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన ఇండియన్ రైల్వేస్.. ప్యాకేజీ వివరాలివే..

Irctc

Irctc

IRCTC Introduces Jyotirlinga Yatra Train Tour Packages: భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది భారత రైల్వే. ఐఆర్‌సీటీసీ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాల టూర్ ప్యాకేజిని ప్రకటించింది. ఈ యాత్ర కింద భక్తులకు జ్యోతిర్లింగాల ధర్మనంతో పాటు ప్రయాణం, వసతి, ఆహారం వంటి సదుపాయాలను, ప్రమాద బీమాను అందించనుంది. ఈ ప్యాకేజీలో ఓంకారేశ్వర్, మహా కాళేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, భేట్ ద్వారక, శివరాజ్ పూర్ బీచ్ లతో సహా జ్యోతిర్లింగాలను కవర్ చేస్తుంది.

Read Also: NTR Health University Name Change: అందుకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాం..!

దేశంలో పర్యటాకాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) భక్తుల కోసం ట్రైన్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో 7 నైట్స్, 8 డేస్ రోజుల సుదీర్ఘ పర్యటన ఉంటుంది. భక్తులను తక్కవ ధరకే జ్యోతిర్లింగాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. టూర్ ప్యాకేజీ ధర రూ.15,150 తో ప్రారంభం కానుంది. ఈ అక్టోబర్ 15న ప్రారంభం అయ్యే ప్రత్యేక స్వదేశ్ దర్శన్ టూరిస్ట్ రైలును ఏర్పాటు చేశారు. అక్టోబర్ 15న ప్రారంభం అయ్యే యాత్ర అక్టోబర్ 22న ముగుస్తుంది.

భక్తులు, యాత్రీకులు ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, భేట్ ద్వారక మరియు శివరాజ్‌పూర్ బీచ్‌లను సందర్శిస్తారు. ఈ ప్యాకేజీలో గోరఖ్‌పూర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్ సంగం, లక్నో, విరంగనా లక్ష్మీ బాయి వంటి ఆన్ బోర్డింగ్, డీ బోర్డింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్యాకేజీ మొత్తం ధర రూ. 15,150. ప్రయాణికులకు స్లీపర్ క్లాస్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. వసతి, దర్శనీయ ప్రదేశాలకు తీసుకెళ్లడం, టిఫిన్, వెజిటేరియన్ భోజనం, టూర్ ఎస్కార్ట్, రైలులో భద్రత, ప్రయాణ బీమా అందించనుంది రైల్వే శాఖ. ఐఆర్‌సీటీసీ సెప్టెంబర్ 30న కొత్తగా భారత్ గౌరవ్ లో భాగంగా మాతా వైష్ణోదేవి కత్రా కోసం నవరాత్రి స్పెషల్ టూరిస్ట్ రైలును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

Exit mobile version