తెలుగు పోలీసు ఉన్నతాధికారి డా. జి. రామ్ గోపాల్ నాయక్‌ను “పోలీసు శౌర్య పతకం” (పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ”) అవార్డు వరించింది. విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను డీఏఎన్ ఐపీఎస్ అధికారి డా. జి. రామ్ గోపాల్ నాయక్ కు అత్యున్నత పురస్కారం లభించింది. గత 19 ఏళ్లుగా ఢిల్లీ పోలీస్ శాఖలో రామ్‌గోపాల్ సేవలందిస్తున్నారు. అయితే 2018లో ఫిబ్రవరి 5 వ తేదీ అర్థరాత్రి ఘాజియా బాద్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో రామ్‌గోపాల్ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఈ ఎన్ కౌంటర్ ద్వారా ఢిల్లీ ప్రజల అభిమానాన్ని రామ్‌గోపాల్ చూరగొన్నారు. సంచలనాత్మక ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసు బృందానికి రామ్‌గోపాల్ నాయకత్వం వహించి 5 ఏళ్లు బాలుడు ను కిడ్నాపర్ల నుంచి కాపాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రామ్‌గోపాల్ నాయక్ స్వస్థలం.
Ramgopal Naik : తెలుగు పోలీసు ఉన్నతాధికారికి ‘శౌర్య’ పతకం
