IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ

  • పెళ్లితో ఒక్కటైన ఐపీఎస్ అధికారుల జంట
  • రాజస్థాన్‌లో గ్రాండ్‌గా జరిగిన వివాహం
  • అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన అన్షికా వర్మ
Ipscouplewedding

Ipscouplewedding

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారుల జంట ఆదివారం రాత్రి పెళ్లితో ఒక్కటయ్యారు. మూడు ముళ్లు బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇరువురు చేసిన ప్రమాణాలతో గ్రాండ్‌గా వివాహం జరిగింది. బరేలీ ఏఎస్పీ అన్షికా వర్మ, సంభాల్ ఎస్పీ కేకే బిష్ణోయ్‌ వివాహం జోధ్‌పూర్‌లోని అజిత్ ప్యాలెస్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక సోమవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. మంచి గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. సంగీత్ కార్యక్రమాలతో ఉల్సాసంగా.. ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో వరుణుడు రాకతో విందుకు ఆటంకం కలిగింది. వర్షం కారణంగా రిసెప్షన్‌ను అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది.

ఇక ఐపీఎస్ పెళ్లి కూతురు అన్షికా వర్మను అప్పగించే సమయంలో ఒక్కసారిగా వాతావరణం దు:ఖమయంగా మారిపోయింది. రాజస్థాన్ ఆచార ప్రకారం నృత్యాలు, సంగీత్ కార్యక్రమంతో అప్పగిస్తున్న సమయంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పెళ్లి కూతురు అన్షికా వర్మ కన్నీటి పర్యంతం అయింది. తల్లిని, చెల్లిని కౌగిలించుకుని చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులంతా కన్నీళ్లు పెట్టుకోవడంతో ఉల్లాసం కాస్త దు:ఖమయంగా మారిపోయింది. మొత్తానికి బంధువులు, శ్రేయోభిలాషులు అన్షికా వర్మను కౌగలించుకుని తలపై చేతులు వేసి ఆశీర్వదించి భర్తతో పంపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.