NTV Telugu Site icon

iPhone 16: ఐఫోన్ 16 @ ‘మేక్ ఇన్ ఇండియా’.. మనదేశం నుంచే ప్రపంచానికి ఎగుమతి..

Iphone 16

Iphone 16

iPhone 16: టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను నిన్న రిలీజ్ చేసింది. నాలుగు మోడళ్లను ఐఫోన్ 16లో తీసుకువచ్చారు. ‘‘ఇట్స్ గ్లోటైమ్’’ ఈవెంట్‌లో ఐఫోన్ 16తో పాటు ఆపిల్ వాచ్, ఎయిర్‌పోడ్స్‌ని విడుదల చేసింది. ఇదిలా ఉంటే చైనా వెలుపల అసెంబుల్ చేయబడిన తొలి ఐఫోన్ ఇదే కావడం విశేషం. పూర్తిగా ‘మేడ్ ఇన్ ఇండియా’గా ఐఫోన్ 16 తయారైంది. భారతదేశ ఫ్యాక్టరీలో తయారు చేయబడిన ఐఫోన్ 16 ప్రపంచ దేశాలకు ఎగుమతి కాబోతోంది.

Read Also: Sushilkumar Shinde: ‘‘నేను హోం మంత్రిగా శ్రీనగర్ లాల్ చౌక్‌కి వెళ్లినప్పుడు భయపడ్డాను’’.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం అన్నారు. ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో తయారుచేయబడిని ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లను సోమవారం విడుదల చేశారు. ఆపిల్ తన ఐఫోన్ 16 ప్రో మోడళ్లను చైనా వెలుపల అసెంబుల్ చేయడం ఇదే మొదటిసారి.

‘‘ ఆపిల్ యొక్క ఐఫోన్ 16 భారతీయ ఫ్యాక్టరీల నుంచి ప్రపంచ దేశాల కోసం ఉత్పత్తి చేయబడుతోంది. పీఎం నరేంద్రమోడీ యొక్క ‘మెక్ ఇన్ ఇండియా’ చొరవ ఇప్పుడు ప్రపంచానికి ఐకానిక్ ఉత్పత్తుల అందిస్తోంది’’ అని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఒక పోస్టులో తెలిపారు. గత ఏడేళ్లుగా ఆపిల్ భారతదేశంలో తన ఉత్పత్తిని క్రమంగా పెంచుతోంది. ఈ విస్తరణ ఆపిల్ మొత్తం ఐఫోన్ ఉత్పత్తిలో భారతదేశ వాటాను ఈ ఏడాది ప్రారంభంలో సుమారుగా 14 శాతం నుంచి వచ్చే ఏడాదికి 25 శాతానికి పెంచుతుందని భావిస్తున్నారు. ఐఫోన్ 16 ప్రోతో పాటు, భారతదేశంలో ప్రత్యేకంగా ఐఫోన్ 17 ఉత్పత్తిని ప్రారంభించాలని ఆపిల్ యోచిస్తోందని సమాచారం.

Show comments