Instagram Influencer Neha Mishra Booked For Doing Item Song Reel In Temple: సోసల్ మీడియాలో లైక్స్ & ఫాలోవర్స్ కోసం ఈమధ్య యువత హద్దుమీరుతోంది. మన సంస్కృతి సంప్రదాయాల్ని సైతం లెక్క చేయకుండా చిందులేస్తోంది. తాజాగా ఓ అమ్మాయి కూడా అలాగే హద్దు మీరింది. గుడి ఆవరణలో ఐటెం సాంగ్‌పై చిందులేసి, నెట్టింట్లో పోస్ట్ చేసింది. అది వైరల్ అవ్వడం, దానిపై దుమారం చెలరేగడంతో.. ఆ యువతి ఇప్పుడు చిక్కుల్లో పడింది. స్వయంగా హోంమంత్రే ఆమెపై కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేయమన్నారంటే.. వ్యవహారం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. నేహా మిశ్రా అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే.. ఇంకా ఫాలోవర్స్ సంపాదించాలన్న మోజులో ఆ యువతి అక్టోబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ దేవాలయం ఆవరణలో ‘దబాంగ్’ సినిమాలోని ‘మున్నీ బద్నాం హుయి’ అనే పాటపై డ్యాన్స్ చేసింది. అది కూడా చిరిగిన జీన్స్‌లో ఆ యువతి అసభ్యకరమైన అభ్యంతకరంగా నృత్యం చేసింది. తాను ఉన్నది ఎంతో పవిత్రమైన చోటు. అక్కడికి చిరిగిన జీన్స్ వేసుకొని వెళ్లడమే పెద్ద తప్పు, అది కాకుండా ‘మున్నీ బద్నాం హుయి’ అంటూ ఐటెం సాంగ్‌పై డ్యాన్స్ చేయడం చూస్తుంటే.. ఆ యువతి కావాలనే ఈ వీడియో చేసినట్టు కనిపిస్తోంది. తన వీడియో వివాదాస్పదమైతే, మరింత ఫేమస్ అవ్వొచ్చన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్టు స్పష్టమవుతోంది.
మొత్తానికి నేహా శర్మ అనుకున్నదే జరిగింది. ఆ వీడియో వైరల్ అవ్వడం, బజరంగ్ దళ కంట పడడంతో.. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తారాస్థాయిలో విమర్శలు వచ్చిపడ్డాయి. దీంతో నేహాశర్మ క్షమాపణలు చెప్పింది. మతపరమైన మనోభావాలు దెబ్బ తీసినందుకు ఆ వీడియోను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. ఆమె క్షమాపణలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్ర సానుకూలంగా స్పందించలేదు. ఆమె వస్త్రధారణ, ఆ వీడియో అభ్యంతకరకంగా ఉన్నాయని.. గతంలో ఇలాంటివి జరిగినప్పుడు చర్యలు తీసుకున్నామన్నారు. అయినా ఆ అమ్మాయి హద్దుమీరింది కాబట్టి.. ఆమెపై కేసు నమోదు చేయబోతున్నామని మిశ్రా తెలిపారు. ఈ మేరకు ఛతర్‌పూర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌కు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
