Site icon NTV Telugu

INS Vagir: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ వజీర్.. ప్రత్యేకతలు ఇవే..

Ins Vagir

Ins Vagir

INS Vagir commissioned into Indian Navy: భారత నౌకాదళం మరింతగా బలోపేతం అయింది. కల్వరి క్లాస్ కు చెందిన 5వ జలంతార్గామ ఐఎన్ఎస్ వగీర్ సోమవారం నౌకాదళంలో చేరింది. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సమక్షంలో ఐఎన్ఎస్ వగీర్ నౌకాదళలోకి ప్రవేశించింది. అత్యంత తక్కువ కాలంలో 24 నెలల్లోనే భారత నౌకాదళంలోకి ప్రవేశించిన మూడో జలంతర్గామి అని హరికుమార్ అన్నారు. భారతదేశ షిప్‌యార్డ్‌ల నైపుణ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు.

Read Also: Jiyaguda Case Twist: జియాకూడా కేసులో ట్వీస్ట్‌.. సాయినాధుని చంపింది స్నేహితులే

భారతదేశం, ఫ్రాన్స్ సహకారంతో కల్వరి క్లాస్ సబ్‌మెరైన్‌లను నిర్మిస్తోంది. ప్రాజెక్టు 75లో భాగంగా నిర్మించిన 5వ సబ్‌మెరైన్‌ ఇది. 1973లో ప్రారంభించిన జలంతర్గామి పేరైన ‘వగీర్’ పేరునే కొత్తగా నిర్మించిన సబ్‌మెరైన్‌ కి పెట్టారు. గతంలో 1973లో ప్రారంభించిన ఈ సబ్‌మెరైన్‌లను 2001లో రిటైర్ అయింది. ఇప్పుడు కొత్తగా మళ్లీ నేవీలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు స్వదేశంతో తయారు చేయబడిన అన్ని జలాంతర్గాముల్లో అతి తక్కువ కాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది ఇదే. వగీర్ అంటే హిందూ మహాసముద్రంలో అత్యంత లోతులో నివసించే సాండ్ ఫిష్ పేరు.

యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణ, మైన్ లేయింగ్ మరియు సర్వైలెన్స్ మిషన్‌లతో సహా విభిన్న మిషన్‌లను చేపట్టగల సామర్థ్యాన్ని వగీర్ కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ సోనార్లు వగీర్ సొంతం. దీంతో పాటు వైర్ గైడెడ్ టార్పిడోలు కూడా ఉన్నాయి. ఈ జలాంతర్గామి నుంచి సబ్ సర్ఫెస్ నుంచి సర్ఫెస్ కు క్షిపణులను ప్రయోగించవచ్చు. ప్రత్యర్థి నౌకాదళంపై వేగంగా దాడిచేసే సామర్థ్యం దీని సొంతం.

Exit mobile version