NTV Telugu Site icon

INS Arighat: ఐఎన్ఎస్ అరిఘాత్.. భారతదేశ రెండో అణు జలంతర్గామి రేపు ప్రారంభం..

Ins Arighat

Ins Arighat

INS Arighat: అణుశక్తితో నడిచే భారతదేశ రెండో జలంతర్గామి రేపు ప్రారంభించబడనుంది. ఐఎన్ఎస్ అరిఘాత్ అణుశక్తితో నడిచే రెండో బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి. అరిఘాట్‌ని రేపు విశాఖపట్నంలో ప్రారంభించే అవకాశం ఉంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రారంభోత్సవానికి కావాల్సిన సన్నాహాలు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఐఎన్‌ఎస్ అరిఘాత్ భారతదేశపు మొట్టమొదటి SSBN (షిప్, సబ్‌మెర్సిబుల్, బాలిస్టిక్, న్యూక్లియర్) సబ్‌మెరైన్. ఇది ఐఎన్ఎస్ అరిహంత్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్. తాజా జలంతర్గామి భారత దేశ నౌకాదళ శక్తిని మరింతగా పెంచబోతోంది. ప్రత్యేకించి దీని స్టాటజిక్ న్యూక్లియర్ డిటొరెస్స్ నౌకదళ సామర్థ్యాన్ని పురోగతిని సూచిస్తుంది. ఈ జలాంతర్గాములు 4-SSBN ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం S4 మరియు S4*గా మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి.

Read Also: Bangladesh: ‘‘జమాతే ఇస్లామీ’’పై నిషేధాన్ని ఎత్తేసిన బంగ్లాదేశ్.. షేక్ హసీనా హయాంలో బ్యాన్..

ఐఎన్ఎస్ అరిఘాత్ నీటి ఉపరితలంపై గరిష్టంగా 12-15 నాట్‌ల(22-28 కి.మీ/గంట) వేగంతో ప్రయాణిస్తుంది. నీటిలోపల 24 నాట్స్( 44 కి.మీ/గంట) వేగాన్ని చేరుకోగలదు. దీనికి ముందు ఉన్న జలాంతర్గాముల లాగే దీనికి నాలుగు లాంచ్ ట్యూబ్స్ ఉన్నాయి. INS అరిహంత్ లాగా INS అరిఘాట్ కూడా 3,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగిన నాలుగు అణు సామర్థ్యం గల K-4 SLBMలను (సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్) లేదా దాదాపు 750 కిలోమీటర్ల పరిధి కలిగిన పన్నెండు K-15 SLBMలను మోసుకెళ్లగలదు. K-15 క్షిపణికి వ్యూహాత్మక అణు వార్‌హెడ్‌ను కూడా అమర్చవచ్చు. ఈ క్షిపణి వ్యవస్థలతో పాటు అరిఘాత్ లో టార్పెడోలను కూడా అమర్చనున్నారు. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్(ఎస్‌బీసీ)లో 2017లో దీని నిర్మాణం ప్రారంభించారు.