మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి అరుదైన గౌరవం లభించింది. స్వచ్చ సర్వేక్షన్ 2021లో భాగంగా ఇండోర్ నగరం తొలి వాటర్ ప్లస్ నగంగా గుర్తింపు పొందినట్టు కేంద్రం ప్రకటించింది. నరగంలో స్వచ్చత, నీటి వినియోగం, డ్రైనేజీ వ్యవస్థ, మరుగుదొడ్ల వినియోగం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని వాటర్ ప్లస్ సర్టిఫికెట్‌ను కేంద్రం అందిస్తుంది. ఇప్పటికే ఇండోర్ స్వచ్చ నగరంగా పేరు తెచ్చుకుంది. మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటూనే నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మున్సిపల్ శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. డ్రైనేజీ నీటిని రీసైక్లింగ్ చేసి వివిధ రకాల అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇండోర్ సిటీ వాటర్ ప్లస్ నగరంగా గుర్తింపు పొందడం పట్ల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇండోర్‌కు మరో అరుదైన గౌరవం: మొదటి వాటర్‌ప్లస్ సిటీగా గుర్తింపు…
