Site icon NTV Telugu

Cyber Attack: 12 వేల భారత వెబ్‌సైట్లను టార్గెట్ చేసిన ఇండోనేషియా హ్యాకర్లు…

New Project (30)

New Project (30)

Cyber Attack: భారత దేశానికి సంబంధించిన 12 వేల వెబ్‌సైట్లను ఇండోనేషియా హ్యకర్లు టార్గెట్ చేసినట్లు కేంద్రం ముందుగానే గుర్తించింది. దీంతో కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను హెచ్చరించింది. వీటిలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చెందిన పలు వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ ‘‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్’’ ఈ దాడిని ముందుగానే పసిగట్టింది. ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని సూచించింది. ‘‘డినయల్ ఆఫ్ సర్వీస్’’, ‘‘డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్’’ దాడుల ద్వారా వెబ్‌సైట్లను హ్యకర్లు తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

Read Also: World Record: గంటలో 3,206 పుష్-అప్స్ ఏంటీ సామి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్

వేర్వేరు వ్యక్తిగత కంప్యూటర్ల ద్వారా ఒకే సారి పెద్ద ఎత్తున డేటాను సైట్లలోకి జొప్పించి పెద్ద ఎత్తున సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించింది. హ్యకర్లు టార్గెట్ చేసిన కొన్ని వెబ్‌సైట్లను గుర్తించి ముందుగానే సమాచారాన్ని రాష్ట్రాలు, యూటీలో పంచుకుంది. అపరిచిత మెయిల్స్, లింకులను ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని అధికారులను హోంశాఖ హెచ్చరించింది. అన్ని సాఫ్ట్‌వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించింది. గత ఏడాది మలేషియాకు చెందిన ఓ హ్యకర్ల ముఠా భారత ప్రతిష్టాత్మక వైద్య సంస్థ ‘‘ఎయిమ్స్’’ను లక్ష్యంగా చేసుకుంది. ఆ సమయంలో అనేక రికార్డులను అధికారులు యాక్సెస్ చేయలేకపోయారు. వైద్యసేవలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది.

Exit mobile version