సాధారణంగా విమానం కాస్త లేటయితే .. సిబ్బందిపై అరవడం.. గొడవ పడడం చేస్తుంటారు కొందరు ప్రయాణీకులు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సూరత్-గోవా విమానం ఏడు గంటలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫైలట్ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో.. మరో ఫైలట్ ను ఏర్పాటు చేసేందుకు దాదాపు 7గంటల సమయం పట్టింది. దీంతో ప్రయాణీకులు గర్భా డ్యాన్స్ చేస్తూ ఎంజాయి చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గోవాలో విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే గర్భా డాన్స్ చేస్తూ కాలక్షేపం చేశారు. గోవా నుంచి సూరత్ కు వెళ్లే ఇండిగా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆలస్యం అయింది. పైలట్ అనారోగ్య కారణంతో .. ఫ్లైట్ లేట్ అయ్యిందని సిబ్బంది వెల్లడించారు. సాయంత్రం 5:00 గంటలకు గోవా నుండి సూరత్‌కు చేరుకునే విమానం దాదాపు ఏడు గంటలు ఆలస్యం అయింది. మరో ఫైలట్ ను ఏర్పాటు చేసేందుకు దాదాపు ఏడుగంటల సమయం పట్టింది. ఈ క్రమంలో తాను గర్బా ఆడేందుకు సూరత్ వెళ్లాలనుకున్నానని ప్రయాణికుల్లో మయూర్ అనే వ్యక్తి అక్కడి సిబ్బందితో చెప్పి వాపోయాడు. దీంతో విషయం తెలుసుకున్న ఇండిగో సిబ్బంది ఎయిర్ పోర్టులోనే స్పీకర్స్ ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఉన్న ప్రయాణీకులంతా కలిసి గర్భా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Passengers perform garba at Goa airport after flight delay, video goes viral | #Watch #ViralVideo #Garba #GoaAirport #Goa pic.twitter.com/vZwe0oHis8
— TIMES NOW (@TimesNow) October 1, 2025
