Site icon NTV Telugu

Surnames: వ్యాపారాల్లో ఈ “ఇంటిపేరు” ఉన్నవారిదే ఆధిపత్యం..

Cash

Cash

Surnames: భారతదేశంలో కొన్ని ‘‘ఇంటిపేర్లు’’ కలిగిన వారు ఎక్కువగా వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. వంశపారంపర్యంగా వ్యాపారమే వారి వృత్తిగా మారింది. అలాంటి వారే దేశంలో అత్యంత సంపన్నమైన ఫ్యామిలీ బిజినెస్‌ని నిర్వహిస్తున్నారు. 2025 హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. నివేదిక ప్రకారం, ‘‘అగర్వాల్’’, ‘‘గుప్తా’’ అనే ఇంటిపేర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు ఇంటిపేర్లకు సంబంధించిన చెరో 12 కుటుంబాలు దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు.

Read Also: Whatsapp Group: దొంగను పట్టించిన వాట్సప్‌ గ్రూప్‌.. వాట్సపా మజాకా..

జాబితాలో మూడో స్థానంలో ‘‘పటేల్’’ ఉంది. ఈ ఇంటిపేరు కలిగిన 10 కుటుంబాలు రిచ్ లిస్టులో ఉన్నారు. ‘‘జైన్’’ ఇంటిపేరు కలిగిన 9 కుటుంబాలు నాలుగో స్థానంలో ఉండగా.. ‘‘మెహతా’’, ‘‘గోయెంకా’’, ‘‘షా’’ ఈ మూడు ఇంటిపేర్లు కలిగిన చెరో 5 కుటుంబాలు సంపన్న జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ‘‘సింగ్’’, ‘‘రావు’’, ‘‘దోషి’’ ఈ 3 సర్ నేమ్‌గా చెందిన మొత్తం 12 కుటుంబాలు చోటు దక్కించుకున్నాయి.

Exit mobile version