Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Indias New Agricultural Vision Pm Modi On The Future Of Natural Farming

Modi Farming Mantra: ‘‘ఒక ఎకరం-ఒక సీజన్’’.. సహజ వ్యవసాయంపై మోడీ కొత్త మంత్రం..

Published Date :December 3, 2025 , 4:31 pm
By Venu Goapl Reddy
  • సహజ వ్యవసాయానికి ప్రధాని మోడీ మద్దతు..
  • ‘‘ఒక ఎకరం-ఒక సీజన్’’ నినాదం..
  • కోయంబత్తూర్ సమ్మిట్‌పై ప్రధాని ప్రశంసలు..
Modi Farming Mantra: ‘‘ఒక ఎకరం-ఒక సీజన్’’.. సహజ వ్యవసాయంపై మోడీ కొత్త మంత్రం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Modi Farming Mantra: సహజ వ్యవసాయంపై ప్రధాని నరేంద్రమోడీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. లింక్డ్‌ఇన్ పోస్టులో సహజ వ్యవసాయం గొప్పతనాన్ని ఆయన వివరించారు. సహజ వ్యవసాయం అనేది ఆధునిక పర్యావరణ శాస్త్రాలను సమన్వయం చేసుకుని, ఎలాంటి ఎరువులు, పురుగుల మందులు లేకుండా పంటలను పండించే ఒక విధానం. ఇందులో ఒకే క్షేత్రంలో పంటలు, చెట్లు, పశువులు కలిసి జీవ వైవిధ్యాన్ని పెంచుతాయి. బయట నుంచి ఎరువులు, మందుల వంటివి వాడకుండా, ఆ వ్యవసాయ క్షేత్రంలో లభించే పేడ, పచ్చిరొట్ట వంటి వాటివి వినియోగించుకుని, మల్చింగ్ వంటి వాటితో నేల సారాన్ని పెంచడం ఈ విధానంలో ముఖ్య లక్షణం.

కోయంబత్తూర్‌ సదస్సును మరిచిపోలేను:

ఇటీవల, ప్రధాని మోడీని ‘‘దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సు-2025’’కు ఆహ్వానించారు. కోయంబత్తూర్‌లో జరిగిన ఈ సమావేశానికి ప్రధాని హాజరయ్యారు. దీనిపై మాట్లాడుతూ.. ‘‘ ఈ ఏడాది ఆగస్టులో, తమిళనాడుకు చెందిన కొంత మంది రైతులను నేను కలిశాను. వారు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతూ, పర్యావరణ అనుకూలంగా ఉండే కొత్త పద్ధతులను అనుసరిస్తున్నట్లు చెప్పారు. కొయంబత్తూర్‌లో జరిగిన సహజ వ్యవసాయ సదస్సుకు నన్ను ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని నేను అంగీకరించి, ఆ సదస్సులో పాల్గొంటానని హామీ ఇచ్చాను. నవంబర్ 19న ఈ సదస్సులో పాల్గొన్నాను. సాధారణంగా MSME రంగానికి ప్రసిద్ధి చెందిన కోయంబత్తూర్ నగరం, సహజ వ్యవసాయంపై సదస్సు నిర్వహించడం విశేషం’’ అని చెప్పారు. కోయంబత్తూర్ సదస్సు తనకు ఎప్పటికీ గుర్తుంటుందని ప్రధాని చెప్పారు. భారత రైతులు, వ్యవసాయం పట్ల మక్కువ, ఉత్సాహం ఉన్న వారు వ్యవసాయాన్ని ఎలా కొత్త దృక్పథంతో నడిపిస్తున్నారనే దానికి ఇది గొప్ప ఉదాహరణ అని తన పోస్టులో ప్రధాని చెప్పారు. ఈ కార్యక్రమంలో చాలా రాష్ట్రాల రైతులతో మాట్లాడినట్లు మోడీ గుర్తు చేసుకున్నారు.

రైతులపై ప్రశంసలు:

ఒక రైతు 10 ఎకరాల్లో బహుళ స్థాయి సాగు చేస్తూ, అరటి, కొబ్బరి, బొప్పాయి, మిరియాలు, పసుపు వంటి పంటలను పెంచుతున్నారని, 60 దేశీ ఆవులు, 400 మేకలు ఉన్నట్లు ప్రధాని చెప్పారు. మప్పిళ్లై సంబా అనే మరో రైతు ‘‘కరుప్పు కావుని’’ వంటి స్వదేశీ బియ్యం రకాలకు తన జీవితాన్ని అంకితం చేశారని పోస్టులో వెల్లడించారు. ఫస్ట్ జనరేషన్‌కు చెందిన ఒక గ్రాడ్యుయేట్ 15 ఎకరాల్లో సహజ వ్యవసాయం చేస్తూ, 3000 మందికి పైగా రైతులకు శిక్షణ ఇచ్చారని, ప్రతీ నెల దాదాపుగా 30 టన్నుల కూరగాయలను సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు(FPOలు) కసావా రైతులను ప్రోత్సహిస్తూ, బయో ఇథనాల్, క్రంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీలో కసావా ముడి ఉత్పత్తుల్ని వాడేలా ప్రచారం చేస్తున్నారని అన్నారు. బయో టెక్నాలజీలో నిపుణుడైన మరో వ్యక్తి సముద్ర శైవలాల ఆధారంగా బయో ఫర్టిలైజర్ తయారు చేసే సంస్థను ప్రారంభించి, తీర ప్రాంతాల్లో 600 మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. వీరందరిలో మట్టిని కాపాడాలి, పర్యావరణాన్ని రక్షించాలనే సంకల్పం కనిపించిందని మోడీ చెప్పారు.

1

ఒక ఎకరం-ఒక సీజన్:

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘‘జాతీయ సహజ వ్యవసాయ మిషన్’’ను ప్రారంభించిందని, దీని ద్వారా లక్షలాది మంది రైతులు సహజ పద్ధతులకు మారుతున్నారని, దేశవ్యాప్తంగా వేల హెక్టార్లలో సహజ వ్యవసాయం జరుగుతోందని ప్రధాని వెల్లడించారు. ఎగుమతుల ప్రోత్సాహం, క్రెడిట్ కార్డ్ ద్వారా సౌకరవ్యవంతమైన రుణాలు, పీఎం కిసాన్ పథకాల వల్ల సహజ వ్యవసాయం మరింత వేగంగా విస్తరిస్తోందని ఆయన అన్నారు. ముఖ్యంగా మహిళా రైతులు అధికంగా ఈ పద్ధతికి ఆకర్షితులు అవ్వడం ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు.

గత కొన్నేళ్లుగా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం నేర సారాన్ని, తేమను తగ్గించిందని, ఉత్పత్తి ఖర్చులు బాగా పెరిగాయని ప్రధాని అన్నారు. వీటన్నింటికి సహజ వ్యవసాయం పరిష్కరిస్తుందని చెప్పారు. ఒక ఎకరం-ఒక సీజన్‌లో ఈ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయాలని తాను రైతులను ప్రోత్సహిస్తున్నానని, చిన్న స్థాయిలో వచ్చిన ఫలితాలు వారికి నమ్మకాన్ని ఇస్తాయని అన్నారు. కోయంబత్తూర్ లో రైతులు, శాస్త్రవేత్తలు, స్టార్టప్స్ ఇలా అందరూ ఒకే చోటుకు రావడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లు మోడీ అన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం రంగాన్ని ఉత్పాదకంగా, పర్యావరణ అనుకూలంగా మార్చుతామని నమ్ముతున్నట్లు చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agricultural reforms
  • Coimbatore natural farming summit
  • eco-friendly farming practices
  • FPO empowerment
  • India natural farming mission

తాజావార్తలు

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

  • Babar Azam: “విరాట్‌ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్

  • Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions