Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- భారత్ చేపట్టిన ‘‘మిషన్ శక్తి’’పై మాజీ యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారి వ్యాఖ్యలు..
- ఈ ప్రయోగంతో ఒక్కసారిగా అమెరికా నిఘా వర్గాల్లో కలకలం..
- మిస్సైల్‌తో శాటిలైట్‌ను కూల్చేసిన భారత్..
- ప్రపంచంలో ఈ సత్తా కలిగిన నాలుగో దేశంగా మారిన ఇండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mission Shakti: 2019లో భారత్ చేపట్టిన ‘‘మిషన్ శక్తి(Mission Shakti)’’యాంటీ-శాటిలైట్ (ASAT) టెస్ట్ అమెరికాలో కంగారు పెట్టించిందని, ఈ టెస్టుతో యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఊహించని విధంగా అప్రమత్తమయ్యాయని మాజీ యూఎస్ ఎయిర్‌ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రుష్ వెల్లడించారు. జోరోగన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన గ్రుష్.. తాను ఆ సమయంలో అమెరికా నేషనల్ రీకనైసెన్స్ ఆఫీస్‌లో ఆపరేషన్ సెంటర్లో డ్యూటీలో ఉన్నానని తెలిపారు.
‘‘2019లో భారత్ ఊహించని విధంగా మిసైల్ టెస్ట్ చేసింది. తన శాటిలైట్లలో ఒకదాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చేసింది. వాళ్లు మాకు చెప్పలేదు.’’ అని గ్రుష్ వివరించారు. భారత్ రాకెట్ టెస్ట్ నిర్వహించబోతుందనే సమాచారం ఉన్నప్పటికీ, ఇది యాంటీ శాటిలైట్ టెస్టుగా మారుతుందని అమెరికా ఊహించలేదని చెప్పారు.
Also Read
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
తాను ఆఫీస్‌లో ఉన్న సమయంలో వరసగా ఫోన్లు చేసి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశానని అన్నారు. ముఖ్యంగా ఉపగ్రహాన్ని కూల్చడం వల్ల ఏర్పడే శిథిలాల వల్ల అమెరికా స్పై శాటిలైట్లకు ప్రమాదం అవుతుందా అనే కంగారు మాలో ఉందని చెప్పారు. పేలుడు తర్వాత ఏర్పడిన శిథిలాలు ఏ ప్రాంతం వరకు విస్తరించాయి, అమెరికా శాటిలైట్ల కక్ష్య మార్చుకోవాల్సి వస్తుందా? అనే ఆలోచనలోకి వెళ్లినట్లు చెప్పారు.
మిషన్ శక్తితో సత్తా చాటిన భారత్:
2019 మార్చి 27న లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డీఆర్డీఓ మిషన్ శక్తి పేరుతో ASAT పరీక్ష నిర్వహించింది. భూమికి సమీపంలో లో-ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న భారత శాటిలైట్‌ను కూల్చేశాము. డీఆర్డీఓ డెవలప్ చేసిన బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ ‘‘హిట్ టూ కిల్’’ విధానంలో విజయవంతంగా ఢీకొట్టింది. ఈ ప్రయోగంతో ఉపగ్రహాలను కూల్చే సత్తా ఉన్న నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ సామర్థ్యం కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది.
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!