Site icon NTV Telugu

Bhargavastra: విజయవంతంగా ‘భార్గవస్త్ర’ పరీక్ష ప్రయోగం.. దీని శక్తి ఏ స్థాయిలో ఉంటుందంటే..!

Bhargavastra2

Bhargavastra2

స్వదేశీ ఆయుధాలతో ఆపరేషన్ సిందూర్ చేపట్టి దాయాది దేశం పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత్.. తాజాగా బుధవారం స్వదేశీ శక్తితో రూపొందించిన అత్యంత శక్తివంతమైన ‘భార్గవస్త్ర’ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాలోని గోపాల్‌పూర్ సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ పరీక్ష నిర్వహించింది. ‘హార్డ్ కిల్’ మోడ్‌తో భార్గవస్త్ర కౌంటర్ డ్రోన్ వ్యవస్థను భారత్ ప్రయోగించింది. ఈ పరీక్ష విజయవంతంగా ముగిసింది. ఇటీవల పాకిస్థాన్ విరివిగా డ్రోన్లు ప్రయోగించింది. అలాంటి డ్రోన్ల సమూహాన్ని ఒకేసారి ‘భార్గవస్త్ర’ ధీటుగా ఎదుర్కోగలదు. మహాభారతంలో వినియోగించిన అపార శక్తిసంపన్నమైన 11 అస్త్రాల్లో భార్గవస్త్ర ఒకటి కావడం విశేషం. ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయగలిగే శక్తి సామర్థ్యాలు దీనికి ఉంటాయని నమ్ముతుంటారు.

ఇది కూడా చదవండి: Nikhil : టర్కీ వస్తువులు వాడొద్దు.. ఆ దేశానికి వెళ్లొద్దు..

గత వారం భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో పాక్‌లోని పలు సైనిక స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఈ సమయంలో పాకిస్థాన్.. భారత్‌పై డ్రోన్లు ప్రయోగించింది. భారత్‌లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ఉపయోగించింది. ఈ నేపథ్యంలోనే డ్రోన్ల సమూహాన్ని ఎదుర్కొనే భార్గవస్త్రం ప్రయోగాన్ని బుధవారం ఒడిశాలో రక్షణ శాఖ చేపట్టింది.

ఇది కూడా చదవండి: Central Cabinet Decisions: కొత్త ‘చిప్‌’ యూనిట్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్

సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL)చే భార్గవస్త్రం అభివృద్ధి చేయబడింది. మే 13న ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్ సీనియర్ అధికారుల సమక్షంలో నిర్వహించిన మూడు పరీక్షల్లో మైక్రో రాకెట్లు అన్ని మిషన్ లక్ష్యాలను ఛేదించగలిగాయి. రెండు పరీక్షల్లో ఒక్కొక్క రాకెట్‌ను ప్రయోగించింది. రెండు సెకన్లలోపు రెండు రాకెట్లను సాల్వో మోడ్‌లో ప్రయోగించడం ద్వారా ఒక ట్రయల్ నిర్వహించబడింది. నాలుగు రాకెట్లు ఊహించిన విధంగా పనిచేశాయి. అవసరమైన ప్రయోగ పారామితులను సాధించాయి. ఇది పెద్ద ఎత్తున డ్రోన్ దాడులను ఎదుర్కోగలిగిన సామర్థ్యం ఉన్నట్లుగా నిరూపించబడింది.

ఇది కూడా చదవండి: Kannappa : ‘కన్నప్ప’తో ‘భైరవం’ పోటీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !

‘భార్గవస్త్ర’.. 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి మైక్రో రాకెట్ల సాయంతో నిర్వీర్యం చేయగల సామర్థ్యం ఉంటుంది. ఇందులోని రాడార్‌ వ్యవస్థ.. గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను కూడా పసిగట్టగలదు. 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల సమూహాన్ని నాశనం చేసేలా దీన్ని రూపొందించారు. ఇక సముద్రానికి 5000 మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో, కొండల ప్రాంతాల్లోనూ వీటిని సమర్థంగా ఉపయోగించుకోవచ్చు.

 

Exit mobile version