Site icon NTV Telugu

India US Crude Oil: భారత్‌-అమెరికా మధ్య పెరిగిన క్రూడ్ ఆయిల్ దిగుమతులు..

Iol

Iol

India US Crude Oil: 2025లో భారత్‌-అమెరికా ముడి చమురు వాణిజ్యం భారీగా పెరిగింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత, యూఎస్ తో భారత్ ముడి చమురు ఒప్పందాలు పెరిగినట్లు సర్కార్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024తో పోలిస్తే 2025లో అగ్రరాజ్యం నుంచి ముడిచమురు దిగుమతులు 51 శాతం పెరిగినట్లు సమాచారం. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఈ పెరుగుదల భారత శక్తి సరఫరా వ్యూహంలో స్పష్టమైన మార్పుకు సంకేతమని చెప్పుకొచ్చారు. 2024లో రోజుకు 0.18 మిలియన్ బ్యారెల్స్ ఇంపోర్ట్ చేస్తే, 2025లో అదే 0.271 మిలియన్ బ్యారెల్స్‌కి వెళ్లింది. ఏప్రిల్-జూన్ మధ్య యూఎస్ నుంచి 114 శాతం దిగుమతులు పెరిగాయి. అంటే, దాదాపు 1.73 బిలియన్ డాలర్ల నుంచి 3.7 బిలియన్ డాలర్లకు చేరింది.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

అయితే, జూన్‌తో పోలిస్తే జూలైలో దిగుమతులు మరో 23 శాతం పెరిగినట్లు తెలియజేశారు. జూన్‌లో మొత్తం చమురు ఇంపోర్టుల్లో అమెరికా వాటా 3 శాతం కాగా, జూలైలో అది 8 శాతానికి పెరిగిపోయింది. ఈ పెరుగుదల భవిష్యత్తులో మరింత కొనసాగే ఛాన్స్ ఉందని సమాచారం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత సంస్థలు కొనుగోలును 150 శాతం మేర పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. అంతేగాక, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ దిగుమతులు సైతం భారీగా పెరిగింది. ఈ వాణిజ్య పెరుగుదలతో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత స్ట్రాంగ్ కానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

Exit mobile version