Site icon NTV Telugu

రైల్వే ప్రయాణికుల జేబులకు చిల్లు

కోవిడ్‌ కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచినా.. మళ్లీ కోవిడ్‌ తగ్గడంతో ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన, పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌ ధరలతో సామాన్యులు సతమతమవుతుంటే తాజాగా, చలికాలం ప్రారంభం కావడంతో రైళ్లలో ఇచ్చే బెడ్‌షీట్లు, దుప్పట్లు కావాలంటే జేబులకు చిల్లులు పడనున్నాయి. ఇకనుంచి రైల్వే శాఖ రూ.30 నుంచిరూ.300 వరకు ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నది.

వాస్తవానికి కోవిడ్‌కు ముందు బెడ్‌షీట్లు,దుప్పట్లు రైల్వే శాఖనే ఉచితంగా ఇచ్చేది. ఢీల్లీతో సహా పలు రైల్వే స్టేషన్లలలో డిస్పోజబుల్‌ బెడ్‌షీట్లు, కిట్లు అందించేందుకు ఆల్ట్రావైబ్రేంట్‌ లగేజ్‌ స్టేషన్లను ప్రారంభించింది. ఇక నుంచి వీటిని ఉచితంగా తీసుకోకుండా రైల్వే శాఖ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టేందుకు డబ్బులు వసూలు చేయనుంది. ప్రస్తుతం 95 శాతం రైళ్ల నడుస్తున్నాయి.57 శాతం రైల్వేస్టేషన్లలోనే ఈ సౌకర్యం ఉందని, కోవిడ్‌ పూర్తిస్థాయిలో తగ్గిన తర్వాత ఇతర స్టేషన్లలో సైతం వీటిని ప్రారంభిస్తారు.

Exit mobile version