Site icon NTV Telugu

డెల్టా ప్ల‌స్ వేరియంట్‌పై దేశీయ వ్యాక్సిన్ల ప్ర‌భావం ఎలా ఉంది?

దేశాన్ని డెల్టా వేరియంట్ మ‌హ‌మ్మారి ఎంతగా ఇబ్బందులకు గురిచేసిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  డెల్టా వేరియంట్ కేసులు వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలో వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేశారు.  దీంతో కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి.  ఇప్పుడు డెల్టాప్ల‌స్ కేసులు అక్క‌డ‌కక్క‌డా న‌మోద‌వుతున్నాయి.  డెల్టా ప్ల‌స్ వేరియంట్‌ల‌పై కూడా దేశీయ వ్యాక్సిన్లు కోవాగ్జిన్‌, కోవీషీల్డ్ ప‌నిచేస్తున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. డెల్టా ప్ల‌స్ వేరియంట్ గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, మెరుగైన ప్ర‌జారోగ్యం ద్వారా ఈ వేరియంట్‌ను ఎదుర్కొన‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.  

Read: “బీస్ట్” కోసం బుట్టబొమ్మ డ్యాన్స్ రిహార్సల్స్

క‌నీసం ఒక‌డోస్ తీసుకున్నా క‌రోనా బారిన ప‌డే ప్ర‌భావం 60 శాతానికి త‌గ్గిపోతుంద‌ని ఇప్ప‌టికే నిరూప‌ణైంది.  లండ‌న్ కు చెంద‌ని యూనివ‌ర్శిటి ఆప్ లండ‌న్ కాలేజీస్ ప‌రిశోధ‌న‌లో ఈ విష‌యాలు వెల్ల‌డైంది.  ఇక ఇండియాలో కూడా నిపుణులు దీనిపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. డెల్టా ప్ల‌స్ కేసులు ఇండియాలోని 10రాష్ట్రాల్లో మొత్తం 48 కేసులు న‌మోదైన‌ట్టు ఐసీఎంఆర్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ తెలిపారు.  ఈ డెల్టా ప్ల‌స్ వేరియంట్‌లు ప్ర‌పంచంలో 12 రాష్ట్రాల్లో న‌మోదైన‌ట్టుగా ఆయ‌న పేర్కొన్నారు. 

Exit mobile version