Site icon NTV Telugu

హెలికాప్టర్ ప్రమాదంపై ఊహాగానాలు వద్దు: IAF

తమిళనాడులో రెండు రోజుల క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. త్రివిధ దళాల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ జరుపుతోందని IAF వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు విచారణలో బయటకు వస్తాయని.. అప్పటివరకు ప్రమాదంపై ఎటువంటి ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని కోరింది. దర్యాప్తు పూర్తయ్యేవరకు తప్పుడు ప్రచారం వద్దని.. ప్రాణాలు కోల్పోయిన వారి మర్యాదను మనం కాపాడాల్సిన అవసరం ఉందని IAF పేర్కొంది.

Read Also: డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే హెలికాప్టర్ మృతులకు అంత్యక్రియలు

కాగా ఈ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులతో సహా 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే హెలికాప్టర్ ప్రమాదంపై త్రివిధ దళాలు సంయుక్తంగా విచారణ చేస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నాడు వెల్లడించారు.

Exit mobile version