Su-57 fighter jets: భారతదేశానికి, మిత్రదేశం రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. రష్యా తన ఐదో తరం, స్టెల్త్ ఫైటర్ Su-57 విమానాలను భారత్‌కు ఆఫర్ చేసింది. మేరకు ఆ దేశ వార్తాసంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం, ఐదో తరం యుద్ధ విమానాలు కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే, పాకిస్తాన్, చైనా నుంచి ఈ విమానాలను కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్‌కు ఫిఫ్ట్ జనరేషన్ ఫైటర్ జెట్స్ చాలా అససరం. Su-57 యుద్ధ విమానాలనున అందించడంతో పాటు టెక్నాలజీ బదిలీ, భారత్‌లోనే తయారు చేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే భారతదేశానికి అదనపు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కోసం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని రష్యన్ మీడియా వెల్లడించింది. “భారతదేశంలో ఇప్పటికే మా వద్ద S-400 వ్యవస్థ ఉంది. ఈ ప్రాంతంలో కూడా మా సహకారాన్ని విస్తరించే అవకాశం ఉంది. అంటే కొత్త డెలివరీలు. ప్రస్తుతానికి, మేము చర్చల దశలో ఉన్నాము,” అని రష్యా యొక్క ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్ అధిపతి డిమిత్రి షుగేవ్ చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
Read Also: Rithu Chowdary : నా భర్తతో రీతూ అక్రమ సంబంధం.. సె* వీడియోస్.. హీరో భార్య సంచలనం?
ఇటీవల, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ దాడుల్ని ఎస్-400 వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఏ ఒక్క మిస్సైల్ కూడా భారత గగనతల రక్షణ వ్యసస్థల్ని ఛేదించలేకపోయింది. చైనాతో పెరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో భారత్ ఐదు S-400 వ్యవస్థల కోసం న్యూఢిల్లీ 2018లో మాస్కోతో $5.5 బిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఇప్పటికే మూడు యూనిట్లు భారత్‌కు రాగా, చివరి రెండు 2026, 2027 కల్లా భారత్‌కు అందించనున్నట్లు రష్యా చెప్పింది.
మేకిన్ ఇండియా ఆయుధాలపై భారత్ దృష్టి సారించినప్పటికీ, ఇప్పటికీ రష్యా, మన దేశానికి అతిపెద్ద రక్షణ భాగస్వామిగా ఉంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ప్రకారం, 2020 మరియు 2024 మధ్య, భారతదేశం యొక్క ఆయుధ దిగుమతుల్లో రష్యా 36% వాటాను కలిగి ఉంది, తరువాత ఫ్రాన్స్ 33% మరియు ఇజ్రాయెల్ 13% వాటాను కలిగి ఉన్నాయి. టీ-90 ట్యాంకులు, Su-30 MKI ఫైటర్ జెట్‌లు రష్యా ఉత్పత్తులు కాగా, బ్రహ్మోస్, AK-203 రైఫిల్స్ తయారీ వంటివి ఇరు దేశాల ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నాయి.
