భారత్‌లో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది.. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం భారత్‌పై ఏ స్థాయిలో ఉందో.. వరుసగా వెలుగు చూస్తున్న కొత్త కేసులే చెబుతున్నాయి.. గత ఐదు రోజులుగా ప్రతీ రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తూ.. కరోనా మీటర్ పరుగులు పెడుతోంది… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 327 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 40,863 కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.
Read Also: ‘హీరో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..
భారత్‌లో కోవిడ్ కేసులు పాజివిటీ రేటు 10.21 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,83,790కు పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 3,44,53,603గా ఉంది.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,90,611 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా స్పీడ్‌గా పెరిగిపోతున్నాయి.. ఇప్పటికే 27 రాష్ట్రాలను ఒమిక్రాన్ చుట్టేసింది.. ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,623కు చేరింది.. ఇప్పటి వరకు 1,490 ఒమిక్రాన్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
