Covid-19: భారత్‌పై మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.. దేశంలో 2,710 యాక్టివ్ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, అంతకుముందు రోజు కంటే 511 కొత్త కేసులు పెరిగాయి. కరోనా బారినపడి ఏడుగురు మరణించారు.. దీంతో, ఈ ఏడాది కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 22కి చేరుకుంది.. ప్రస్తుతం కేరళ 1,147 యాక్టివ్ కేసులతో అత్యంత ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది.. 227 కొత్త ఇన్ఫెక్షన్ల పెరుగుదల కనిపించింది. 424 యాక్టివ్ కేసులతో మహారాష్ట్ర తరువాతి స్థానంలో ఉంది, గత 24 గంటల్లో 40 కేసులు పెరిగాయి. ఢిల్లీలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించింది, 56 కొత్త కేసులువెలుగు చేశాయి.. మరోవైపు, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య కూడా పెరుదుగున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.. గత 24 గంటల్లో 255 మంది రోగులు కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. జనవరి 1 నుండి కోలుకున్న కేసుల సంఖ్య 1,170గా ఉంది. కేరళ (72), ఢిల్లీ (77), మహారాష్ట్ర (34) ఈ రోజు అత్యధికంగా కోలుకున్నారు.. మొత్తంగా కరోనా కేసులు పెరుగుల మరోసారి కలవరపెడుతోంది.. మే 25వ తేదీ తర్వాత ఏకంగా ఐదు రెట్లు పెరిగాయి కరోనా పాజిటివ్ కేసులు..
Read Also: Aditi Bhavaraju : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సింగర్ అదితి భావరాజు..
