IND- US Defense Deals: భారత్‌పై 25 శాతం టారీఫ్స్ తో పాటు పెనాల్టీ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అంతటితో ఆగకుండా భారత్, రష్యా బంధంపై తీవ్రంగా మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో భారత్ తీవ్ర నిరాశకు గురైంది.. దీంతో రక్షణ రంగ ఒప్పందాల ఆమోదం విషయంలో ముందుకు వెళ్లాలనుకోవడం లేదని అంతర్జాతీయ మీడియా కథనం బ్లూమ్‌బర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో, భారత ప్రభుత్వం వాణిజ్య చర్చలు కొనసాగించాలని అనుకుంటుంది.. కానీ, అగ్రరాజ్యం నుంచి కొనుగోళ్లను పెంచే మార్గాలను అన్వేషిస్తోందని వెల్లడించింది.
Read Also: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట..
అయితే, సహజ వాయువు కొనుగోళ్లు, కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం దిగుమతులను పెంచే అంశాన్ని మోడీ సర్కార్ పరిశీలిస్తోంది. రానున్న 3-4 ఏళ్లలో ఈ కొనుగోళ్ల కారణంగా అమెరికాతో భారత్‌కున్న వాణిజ్య మిగులు కొంతమేర తగ్గే ఛాన్స్ ఉంది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్‌కు తక్షణమే ధీటుగా బదులిచ్చే ఆలోచన చేయడం లేదని తెలుస్తుంది. కానీ, కొత్త రక్షణ ఒప్పందాలను మోడీ సర్కార్ ఆమోదించే అవకాశం మాత్రం లేదని సమాచారం. F-35 యుద్ధ విమానాల కొనుగోలుపై ఇంట్రెస్ట్ లేదని ఇప్పటికే యూఎస్ అధికారులకు భారత్ చెప్పినట్లు తెలుస్తుంది. ఇండియాకి తన రక్షణ రంగ ఎగుమతులను మరింత విస్తరించాలని చూస్తున్న తరుణంలో వాషింగ్టన్ కు ఇది గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.
Read Also: Uttarakhand: 5 ఆస్పత్రుల నిర్లక్ష్యం.. ఏడాది బాలుడు మృతి.. ముఖ్యమంత్రి ఆగ్రహం
ఇక, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంగా ఎఫ్-35 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు యూఎస్ ఒప్పుకుంది. మోడీతో భేటీ తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మేరకు ఓ రిలీజ్ చేశారు. భారత్‌తో తాము దాదాపు నాలుగున్నర వేల కోట్ల డాలర్ల వాణిజ్య లోటును కలిగి ఉన్నామని ట్రంప్ తెలియజేశాడు. దాన్ని తగ్గించుకోడానికి వాషింగ్టన్ నుంచి న్యూఢిల్లీ మరింత చమురు, గ్యాస్, మిలిటరీ హార్డ్‌వేర్ కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. టారీఫ్స్ విషయంలో మాత్రం భారత్‌నూ వదలి పెట్టమన్నారు. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్న తరుణంలో 25శాతం సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తూ ట్రంప్ విరుచుకుపడ్డారు.
Read Also: Home Minister Vangalapudi Anitha: అది వార్నింగ్ కాదు.. సినిమా డైలాగ్..
కాగా, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రాత్రికి రాత్రే భారత్‌తో ఉన్న సమస్యలు పరిష్కారం కావని యూఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భారత్‌తో నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయి. అలాగే, భారత్-రష్యాల దీర్ఘకాల అనుబంధం, బ్రిక్స్‌పై వ్యతిరేకత, వాణిజ్య ఒప్పందంతో పాటు దేశ వ్యవసాయ సామాగ్రి, డెయిరీ ఉత్పత్తుల్లోకి అమెరికాకు ప్రవేశం కల్పించడానికి భారత ప్రభుత్వం విముఖత వ్యక్తం చేయడం వల్ల డొనాల్డ్ ట్రంప్ అసహనానికి ప్రధాన కారణాలు అయ్యాయి.
