కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించాలని భారత్-పాకిస్థాన్ నిర్ణయించాయి. ఈనెల 10న డీజీఎంవోలు మధ్య కుదిరిన అవగాహనను కొనసాగించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు కొనసాగించాలని ఇరు దేశాల డీజీఎంవోలు నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Off The Record: పశ్చిమ గోదావరి జిల్లా కూటమి రాజకీయం ఎలా మారబోతుంది..?
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అనంతరం మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ఇరు దేశాలకు సంబంధించిన డీజీఎంవోలు సమావేశమై కాల్పుల విరమణ ప్రకటించాయి. గురువారం మరొకసారి సమావేశమై కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాయి.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: ట్రంప్‌పై కంగనా రనౌత్ పోస్ట్.. నడ్డా ఆదేశాలతో తొలగింపు.. పోస్ట్‌లో ఏముందంటే..!
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లో భారీగా నష్టం జరిగింది. వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అలాగే 50 మంది సైనికులు కూడా చనిపోయారు. ఇక నియంత్రణ రేఖ వెంబడి జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. మొత్తానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయింది.
