Site icon NTV Telugu

Indira Gandhi 1971 Decision: పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెట్టింట 1971లో ఇందిరా గాంధీ నిర్ణయంపై చర్చ

Indira

Indira

Indira Gandhi 1971 Decision: భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధానికి శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాక్, ప్రస్తుత పరిస్థితులపై కొందరు కాంగ్రెస్ నేతల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇందిర కాలం నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు.

Read Also: Trisha : త్రిష‌కు అద్భుతంగా ప్రపోజ్ చేసిన అభిమాని..

అయితే, పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యను ప్రధాని నరేంద్ర మోడీ వైఖరితో పోల్చుతూ సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. 1971 యుద్ధం సందర్భంగా సైనికులతో మాజీ ప్రధాని ఇందిరా దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో హస్తం నేతలు పోస్టు చేస్తున్నారు. ఇందిర లేని లోటు కనిపిస్తోందని పేర్కొంటున్నారు. ‘ఇందిర ధైర్యం చూపారు.. దేశం కోసం నిలబడ్డారని రాసుకొచ్చారు. జాతి పౌరుషంతో ఆమె రాజీ పడలేదని కాంగ్రెస్‌ నెట్టింట తెలిపింది.

Read Also: Neha Sharma : నేహా శర్మ.. జిమ్ డ్రెస్ లో భలేగా అదరగొడుతున్నావమ్మా

మరోవైపు, పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ అంశంపై తక్షణమే ప్రధాని మోడీ అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నారు. పార్లమెంటు ప్రత్యేక సెషన్‌ నిర్వహించి ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు. ఇక, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ ఎక్స్ వేదికగా.. అమెరికా నుంచి కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన తర్వాత ప్రధాని మోడీ అధ్యక్షతన తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. దేశంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలను ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలి’ అని కోరారు.

Exit mobile version