నార్త్ ఇండియాలో ప్రతి సంవత్సరం కర్వా చౌత్ పండగ జరపుకుంటారు. ఈ పండగలో భార్య తన భర్త ఆరోగ్యంగా.. నిండు నూరేళ్లు బతకాలని కోరకుంటూ.. మహిళలు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. అనంతరం మహిళలు ఓ పున్నమి రాత్రి చంద్రుడిని చూసి .. ఆ తర్వాత తమ భర్త మొఖం చూస్తారు.. ఇదంతా సాధారణమే అయినప్పటికి ఇక్కడ ఓ వింత చోటు చేసుకుంది. అదేంటంటే.. ఒకే అమ్మాయి ఇద్దరిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి మొదట ఎవరి మొఖం చూసింది.
Read Also:Viral Video : గాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ .. తేడా కొడితే.. అంతే సంగతులు
హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లా షిల్లాయ్ ప్రాంతంలో ఇద్దరు సోదరులు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. హాతీ సంప్రదాయంలో ఇలా జరుగుతుండగా.. ఈ కల్చర్‌ను కంటిన్యూ చేస్తూ ఈ స్పెషల్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓ ఇన్‌స్టా పేజ్ క్రియేట్ చేసి ఫుల్ పాపులర్ అయిపోయారు. ప్రదీప్, కపిల్ వేగి పార్టనర్ సిస్టమ్ కింద జూలై 13న సునీతను పెళ్లి చేసుకున్నారు. వివాహమై మూడు నెలలు కాగా అప్పుడు మొదటి కర్వా చౌత్ వచ్చేసింది. ఈ క్రమంలో ప్రజల దృష్టి వీరి మీద పడింది. ఇంతకీ ఆ అమ్మాయి పూజ పూర్తయ్యాక ఎవరిని ముందుగా చూస్తుందనే చర్చ జరిగింది.
Read Also:Venis: గూగుల్ ను నమ్మి కాలువలో పడ్డ పోలీష్ యువతి
వీటన్నింటికి సమాధానం చెప్పారు ఈ ప్రత్యేక దంపతులు. ఇప్పటికే అన్నయ్య కపిల్ నేగి విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లగా.. ప్రదీప్ ఇండియాలో భార్యతో ఉన్నాడు. అతను ఆఫీసు నుంచి నేరుగా భార్య దగ్గరికి వెళ్తున్నానని కర్వా చౌత్ సెలబ్రేషన్స్‌కు వెళుతున్నట్లు తెలిపాడు. మరోవైపు కపిల్ నేగి వారితో వీడియో కాల్ ద్వారా మాట్లాడాడు. శుభాకాంక్షలు చెప్పాడు. వైవాహిక జీవితం ప్రేమ, నమ్మకం, ఆనందంతో నిండి ఉండాలని కోరుకున్నారు.
