Fighter jets: భారత్‌కు 5వ తరం ఫైటర్ జెట్స్ ఎందుకు అవసరం.. అమెరికా F-35, రష్యా su-57లో ఏది బెటర్..
- 5వ తరం ఫైటర్ జెట్ భారత్‌కి చాలా అవసరం..
- అమెరికా, చైనా, రష్యాల వద్ద అత్యాధునిక ఫైటర్ జెట్స్..
- ఎఫ్-35, Su-57లను ఆఫర్ చేస్తున్న యూఎస్, రష్యా..
- స్వదేశీ టెక్నాలజీతో నిర్మిస్తున్న AMCA
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fighter jets: ప్రస్తుతం యుద్ధ వ్యూహాలు మారుతున్నాయి. అత్యాధునిక ఆయుధాలే కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు ఇప్పుడు 5వ తరం స్టెల్త్ యుద్ధవిమానం అవసరం. ముఖ్యంగా, పాకిస్తాన్, చైనా నుంచి వస్తున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే ఈ కొత్త తరం ఫైటర్ జెట్ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే 5 వ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. భారత్ కొనుగోలు చేయాల్సి వస్తే అమెరికా, రష్యా నుంచే తీసుకోవాలి. భారత్ తన సొంత 5వ తరం అత్యాధునిక ఫైటర్ జెట్ కోసం AMCA ప్రాజెక్ట్‌ను చేపట్టింది. అయితే, దశాబ్ధకాలం కానిదే మన సొంత ఫైటర్ జెట్ సాధ్యం కాకపోవచ్చు. మరోవైపు, చైనా తన 6వ తరం ఫైటర్ జెట్‌ని పరీక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read Also: US Tariffs: భారత ఆర్థిక వ్యవస్థపై “డెడ్ ఎకానమీ” వ్యాఖ్య.. ట్రంప్‌ను విమర్శిస్తున్న సొంత దేశస్థులు..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
అమెరికా, రష్యా విమానాల్లో ఏది ఎంచుకోవాలి..?
అమెరికా వద్ద F-35, రష్యా వద్ద Su-57 ఫైటర్ జెట్లు ఉన్నాయి. రెండు దేశాలు కూడా భారత్‌కి ఈ అత్యాధునిక ఫైటర్ జెట్స్ అమ్మాలని చూస్తున్నాయి. అయితే, భౌగోలిక, వ్యూహాత్మక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏ దేశం నుంచి మనం కొనుగోలు చేసినా కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. మన ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యా నుంచి Su-57 ఫైటర్ జెట్‌ని భారత్ కొనుగోలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వినిపిస్తుంది. ఎందుకంటే, భారత్ తన ఆయుధాలు, టెక్నాలజీలో ఎక్కువగా రష్యాపై ఆధారపడి ఉంది. రష్యా నుంచి ఫైటర్ జెట్ కొంటే రష్యన్ ఆయుధాలతో అనుసంధానం సులువు అవుతుంది. మరోవైపు, రష్యా నుంచి కొనుగోలు చేస్తే, అమెరికాకు ఆగ్రహం వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా, కాట్సా నిబంధనల్ని భారత్‌పై విధించి, ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది.
మరోవైపు, అమెరికన్ F-35 విమానాలను ఎంచుకుంటే, అది ఎక్కువగా రష్యన్-దిగుమతి చేసుకున్న రక్షణ వస్తువులతో మ్యాచ్ కాలేకపోవచ్చు. దీనికి తోడు అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీని మెయింటనెన్స్ కూడా అధికం. ఇటీవల, తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఈ ఎఫ్-35 ఫైటర్ జెట్ సాంకేతిక కారణాలతో 20 రోజుల పాటు నిలిచిపోయింది. దీని ద్వారా చూస్తే ఈ విమానాల్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది.
మన ఫైటర్ జెట్ కోసం ప్రయత్నాలు:
రక్షణ రంగంలో ‘‘ఆత్మనిర్భర్’’గా మారేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే భారత్ AMCA ప్రాజెక్టును చేపట్టింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఐదవ తరం స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ కావడంతో, ఇది అన్ని వాతావరణాలలో పనిచేయడానికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ రాడార్ క్రాస్-సెక్షన్ మరియు సూపర్ క్రూయిజ్ సామర్థ్యంతో రూపొందించబడిన AMCA, ఫ్రంట్‌లైన్ సుఖోయ్ Su-30MKI ఫైటర్ జెట్లకు వారసుడిగా పరిగణించబడుతుంది.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..