దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. సెకండ్ వేవ్ కారణంగా పెద్దఎత్తున్న కేసులు, మరణాలు నమోదైన సంగతి తెలిసిందే. కరోనా కేసులు పీక్స్ దశలో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మూడు నెలల తరువాత కేసులు అత్యల్ప సంఖ్యలో నమోదవుతుండటం మంచి విషయమే. మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నది.
Read: ఫోటోషూట్లతో నెట్టింట్లో జాన్వీ కపూర్ రచ్చ…!
తాజాగా దేశంలో 46,148 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,79,331కి చేరింది. ఇందులో 2,93,09,607 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,72,994 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 979 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,96,730కి చేరింది. దేశంలో రికవరీ రేటు 96.80శాతంగా ఉన్నది.
