Site icon NTV Telugu

ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

ఇండియాలో క‌రోనా మ‌హమ్మారి కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.  తాజాగా ఇండియాలో 32,937 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో భార‌త్‌లో కొత్త‌గా 417 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  24 గంట‌ల్లో 35,909 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 3,14,11,924కి చేర‌గా, 3,81,947 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక భార‌త్‌లో క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,31,642కి చేరింది.  క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌టే మార్గం కావ‌డంతో వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 54,58,57,108 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియ‌జేసింది.  

Read: ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసం ఎదుట ఉద్రిక్తత్త

Exit mobile version